'ఆర్ఆర్‌ఆర్‌' మళ్లీ అదే చర్చ మొదలైంది, విడుదలయ్యే వరకు ఈ సస్పెన్స్‌ కంటిన్యూ అవ్వాల్సిందేనా?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.పైగా రేపు రిపబ్లిక్ డే కనుక ఆ సందర్బంగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

 Again Suspense On Rrr Movie Characters, Discussion About Rrr Movie Charcters, Ra-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాలున్న ఆర్‌ఆర్ఆర్‌ సినిమా ను అక్టోబర్‌ లో విడుదల చేయాలని నిర్ణయించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ప్రకటించారు.

ఇక సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేసిన యూనిట్‌ సభ్యులు ఒక పోస్టర్‌ ను విడుదల చేశారు.అందులో రామ్‌ చరణ్‌ గుర్రంపై, ఎన్టీఆర్‌ బైక్ పై ఉన్నారు.

వీరిద్దరు అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్‌ పాత్రల్లో కనిపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో వీరి లుక్స్ కు మరియు వారి బాడీ లాంగ్వేజ్ కు అస్సలు సంబంధం లేదు అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

Telugu Ajay Devgan, Allurisitarama, Komaram Bheem, Rajamouli, Ram Charan, Ramcha

బాలీవుడ్‌ నుండి కోలీవుడ్‌ టాలీవుడ్ వరకు అందరు ఎదురు చూస్తున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్‌ సినిమా లో హీరోలుగా నటిస్తున్న రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ ల నేపథ్యం ఏంటీ మరియు వారు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు అనేది ఆసక్తికరంగా ఉంది.సాదారణంగా అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్ పాత్రలు స్వాతంత్ర్య సమరయోధులు గా మాత్రమే మనకు తెలుసు.కాని ఇక్కడ మాత్రం సినిమా స్వాతంత్య్ర సంగ్రామం కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా పలు సందర్బాల్లో ఈ సినిమా ఒక ఫాంటసీ సినిమా మాత్రమే అని ఇది ఎప్పటికి స్వాతంత్య్ర నేపథ్య సినిమా కాదనే చెబుతున్నారు.

ఇలాంటి సమయంలో హీరోల పాత్రలు ఏంటీ అనే చర్చ మళ్లీ మొదలు అయ్యింది.ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ అజయ్ దేవగన్‌ పోషిస్తున్న పాత్ర ఏంటీ.విదేశీ ముద్దుగుమ్మలు ఎందుకు అనే విషయాలు అన్ని కూడా సినిమా విడుదల అయ్యే వరకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube