అప్పట్లో చాలామంది సినిమా ఇండస్ట్రీలో మనకు తగ్గ పని ఏదైనా ఒకటి దొరుకుతుంది అని అనుకొని ఏమి ఆలోచించకుండా ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్లే వారు.ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు, మోహన్ బాబు, చిరంజీవి లాంటి చాలా మంది హీరోలు అలా వెళ్లి ఇండస్ట్రీలో స్థిరపడిన వారే అలాగే వీళ్లతో పాటు ఇండస్ట్రీలో అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ అందరి పరిస్థితి దాదాపు ఇదే.
అలా వచ్చిన వాళ్ళలో కొందరు హీరోలు అయితే, ఇంకొందరు విలన్లుగా చేసి మంచి గుర్తింపు పొందారు అలాగే సినిమాల్లో చేసి మంచి గుర్తింపు పొందిన ఆర్టిస్ట్ ఒకరున్నారు ఆయన ఎవరంటే సి.ఎల్ ఆనందన్ ఈయన ఎవరు అంటే అప్పట్లో ఐటమ్ సాంగ్ లలో నటించి మంచి గుర్తింపు సాధించిన డిస్కో శాంతి వల్ల నాన్న.సి.ఎల్ ఆనందన్ 1935, జూన్ 15న జన్మించారు.
ఈయన మలయాళంలో అచ్చన్ అనే సినిమాతో పరిచయం అయ్యారు ఆ తర్వాత తమిళ్ మలయాళంలో చాలా సినిమాలు చేశారు తమిళ్ లో ఆయన చేసిన విజయపురి సినిమాలో హీరోగా చేశారు.హీరో హీరో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా కూడా తను నటించాడు.
అయితే ఆయన లక్ష్మి అనే ఆవిడ ని పెళ్లి చేసుకున్నారు.వీళ్లకు నలుగురు పిల్లలు కాగా లలిత కుమారి డిస్కోశాంతి లు మన అందరికీ పరిచయస్తులు.
ఆనందన్ 1989లో జాండీస్ వ్యాధితో చనిపోయారు.తన కూతురు అయిన లలిత కుమారి కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత విలక్షణ నటుడు ఆయన ప్రకాష్ రాజు ని పెళ్లి చేసుకుంది వీళ్లకు ముగ్గురు పిల్లలు అయితే కొన్ని కారణాల వలన ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది.
అలాగే ముగ్గురు పిల్లల్లో ఇద్దరమ్మాయిలు ఒక అబ్బాయి కాగా అబ్బాయి చనిపోయారు ప్రస్తుతం లలిత కుమారి ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఉంది.ప్రకాష్ రాజ్ మాత్రం ఇంకో పెళ్లి చేసుకొని సినిమాల్లో నటిస్తూ తన వర్క్ లో తను బిజీగా ఉన్నాడు.
డిస్కో శాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే అప్పట్లో వచ్చిన ఐటెం సాంగ్స్ లో అన్నింటిలో తనే ఆడి పాడేది చిరంజీవితో రౌడీ అల్లుడు సినిమాలో ఒక సాంగ్ లో స్టెప్పులు వేసింది.అలాగే ఘరానా మొగుడు సినిమా లో బంగారు కోడిపెట్ట సాంగ్ లో కూడా చిరంజీవి పక్కన తనే చేసింది ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది.
అందుకే మళ్ళీ అదే సాంగ్ ని రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమాలో రీమిక్స్ చేశారు అది కూడా చాలా పెద్ద హిట్ అయింది.అయితే డిస్కో శాంతి రియల్ స్టార్ అయిన శ్రీహరి ని పెళ్లి చేసుకుంది.
మొదట్లో శ్రీహరి విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ ఆ తర్వాత హీరోగా కూడా చాలా సినిమాల్లో నటించాడు.

N.శంకర్ డైరెక్షన్లో వచ్చిన భద్రాచలం సినిమా తో తనకంటూ మంచి గుర్తింపు సాధించాడు.అలాగే కుబుసం లాంటి సినిమాల్లో తనదైన ప్రత్యేక నటనతో అవార్డు కూడా గెలుచుకున్నాడు.అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డి, కింగ్, మగధీర వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ఈ సినిమాల విజయంలో తన పాత్ర కీలకమని అని నిరూపించాడు.2013లో అనారోగ్య కారణం వల్ల ఆయన చనిపోయారు ఇప్పటికీ తను లేని లోటును తీర్చే నటుడు ఇంకా తెలుగు ఇండస్ట్రీకి దొరకలేదని చెప్పాలి.శ్రీహరి డిస్కో శాంతిలా కొడుకు కూడా రాజ్ దూత్ అనే సినిమాలో హీరోగా నటించాడు.లలిత కుమారి తన పిల్లలతో ఉంటుంది.ప్రస్తుతం శ్రీహరి చనిపోయిన తర్వాత డిస్కో శాంతి కూడా తన పిల్లలను చూసుకుంటూ ఉంటుంది ఈ మధ్య ఇంటర్వ్యూకి వచ్చిన డిస్కో శాంతి శ్రీహరి లేకుండా బతకడం చాలా బాధగా ఉందని చెప్పింది.