డిస్కోలో సీక్వెల్ ఆడుతానంటున్న రాజా

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

 Disco Raja To Have Sequel-TeluguStop.com

విభిన్న చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో రవితేజ మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర పోస్టర్స్, టీజర్స్ చూస్తే అర్ధమవుతోంది.

పూర్తి సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పాత్ర ఏమిటా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కాగా ఈ సినిమా చేస్తున్నంత సేపు తాను నిజంగా ఎంజాయ్ చేశానని రవితేజ చెప్పుకొచ్చాడు.తాజాగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సినిమా సక్సెస్‌పై పూర్తి ధీమాను వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా తనకు బాగా నచ్చి చేశానని, భవిష్యత్తులో అవకాశం వస్తే ఈ సినిమాకు సీక్వెల్‌కు చేస్తానని రవితేజ చెప్పుకొచ్చాడు.

పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా రామ్ తాళ్లూరి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాడు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube