మాస్ రాజా రవితేజ డిస్కో రాజా సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద రవితేజ భారీగా హోప్స్ పెట్టుకున్నాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో కమర్షియల్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా హిట్ తో మరల తన రెగ్యులర్ మార్కెట్ పై దృష్టిపెట్టాలని భావించాడు.ఇక రవితేజతో నేల టికెట్ సినిమా తీశి బొక్క బోర్లా పడ్డ నిర్మాత రామ్ తళ్లూరి మరో సారి రవితేజ మీద నమ్మకం పెట్టుకొని ఈ సైన్సు ఫిక్షన్ లో తెరకెక్కిన డిస్కో రాజా మీద భారీగా ఖర్చు పెట్టాడు.
ఇక రిలీజ్ కి ముందు వచ్చిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు భాగానే పెంచింది.
అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజే ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.
దానికితోడు సంక్రాంతి బరిలో ఉన్న రెండు హిట్ సినిమాలు జోరు మీద ఉండటంతో డిస్కో రాజాకి థియేటర్స్ పెద్దగా దొరకలేదు.దీంతో అతని కెరియర్ లో తక్కువ ఓపెనింగ్స్ ని ఈ సినిమా రాబట్టింది.
అయితే సినిమాకి హిట్ టాక్ వస్తే లాంగ్ రన్ లో కలెక్షన్స్ పుంజుకునే అవకాశాలు ఉన్నా కూడా ఎవరేజ్ టాక్ నుంచి డివైడ్ టాక్ లోకి వచ్చేసింది.దీంతో అప్పుడే ఉన్న థియేటర్స్ కూడా హౌస్ ఫుల్ పడటం లేదని తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో సినిమాని భారీగా డబ్బులు పెట్టి కొన్న బయ్యర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి లాంగ్ రన్ లో డిస్కో రాజా నిర్మాతకి, బయ్యర్లకి ఎంత నష్టం మిగులుస్తుందో అనేది చూడాలి.