డిస్కో రాజా ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అంటోన్న విఐ ఆనంద్  

Disco Raja Based On Failed Project-nabha Natesh,payal Rajput,raviteja,vi Anand

మాస్ రాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం డిస్కో రాజా చిత్రం మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఈ సినిమాతో రవితేజ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

Disco Raja Based On Failed Project-nabha Natesh,payal Rajput,raviteja,vi Anand -Disco Raja Based On Failed Project-Nabha Natesh Payal Rajput Raviteja Vi Anand

ఇటీవల సరైన హిట్లు లేక సతమతమవుతున్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.ఔట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా గురించి దర్శకుడు విఐ ఆనంద్ ఓ ఆసక్తికరమైన విషయం తెలిపారు.

డిస్కో రాజా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ చాలా కష్టపడిందని ఆయన తెలిపారు.తనకు చిన్నప్పటి నుండి సైన్స్ ఫిక్షన్ కథలన్నా, సినిమాలన్నా చాలా ఇష్టమని చెప్పిన ఆయన ఈ సినిమాను ఓ సైన్స్ రిసెర్చ్ మరియు అట్టర్ ఫ్లాప్ అయిన ప్రాజెక్టును ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని తెరకెక్కించానంటూ కుండ బద్దలు కొట్టాడు.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పడంతో ఈ సినిమా కథ ఎలా ఉంటుందా అని ఆడియెన్స్ ఆతృతగా చూస్తున్నారు.ఈ సినిమాలో రవితేజ ఓ సరికొత్త పాత్రలో నటిస్తున్నాడని, విలన్‌గా బాబీ సింహా యాక్టింగ్‌తో అలరిస్తాడని ఆయన తెలిపారు.

ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో చూడాలి.

తాజా వార్తలు

Disco Raja Based On Failed Project-nabha Natesh,payal Rajput,raviteja,vi Anand Related....