డబ్బులు లేకపోతే తాళం ఎందుకు వేశారు..కలెక్టర్ కు దొంగలు లేఖ..!

ఈ మధ్య దొంగతనాలు దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి.పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కూడా నేరగాళ్లు పెరిపోతున్నారు.

 Disappointed Thief Leaves Note At Sdm House In Mp, Bhopal, Collector, Deputy Col-TeluguStop.com

నడి రోడ్డు మీదనే దొంగతనాలకు పాల్పడుతున్నారు.వాళ్ళను అడ్డగిస్తే చంపడానికి కూడా వెనుకాడడం లేదు.

తాజాగా మధ్యప్రదేశ్ లో దొంగలు చేసిన ఘనకార్యం వింటే ముక్కున వేలేసుకుంటారు.దొంగలు ఇంతకీ తెగించారంటే ఏకంగా కలెక్టర్ ఇంటికే కన్నం వేయాలని ప్లాన్ వేశారు.

కలెక్టర్ ఇంటికి సెక్యూరిటీ ఉంటుందని తెలిసి కూడా దొంగలు కన్నం వేయడానికి ఎంత మాత్రం వెనుకాడ లేదు.అంతేకాదు ఆ కలెక్టర్ ఇంటికి కొద్దీ దూరంలోనే పోలీస్ సూపరింటెడ్ ఇల్లు కూడా ఉంది.

అయినా కూడా ఆ దొంగలకు భయం లేకుండా డిప్యూటీ కలెక్టర్ ఇంటికే కన్నం వేశారు.ఇంట్లో భయం లేకుండా చొరబడి ఇల్లంతా గాలించారు.కానీ వాళ్లకు కావలసిన వస్తువులేమి దొరకలేదు.

దీంతో నిరాశతో వెనుతిరిగారు.

అలా వెళ్లే వారు వెళ్లకుండా ఒక లెటర్ కూడా రాసి పెట్టి మరి వెళ్ళారు.ఇంతకీ లెటర్ లో ఏమని రాసారంటే.ఇంట్లో డబ్బులు లేవు.మరి ఇంటికి తాళం వేసి ఎందుకు వెళ్లారు? అని రాసి డోర్ దగ్గర పెట్టేసి వెళ్లిపోయారు.ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.భోపాల్ డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ గౌర్ అధికారిక నివాసంలో దొంగలు పడ్డారు.

Telugu Bhopal, Deputy, Thief Sdm Mp, Letter, Madhya Pradesh, Theft, Trilochan Ga

అయితే ఆ దొంగలకు ఇంట్లో ఏమి దొరక్క పోవడంతో ఇలా లెటర్ రాసి పెట్టి వెళ్లిపోయారు.దొంగతనం చేయడమే నేరం.అలాంటిది ఒక కలెక్టర్ ఇంట్లో దొంగతనానికి వెళ్లడమే కాక డబ్బులు లేకపోతే తాళం ఎందుకు వేశారు అని ప్రశ్నించడంతో ఇప్పుడు ఈ లేఖ వైరల్ అవుతుంది.ఉన్న కొద్దిపాటి బంగారం, డబ్బులు దొంగలు చోరీ చేసారు.30 వేల డబ్బులు, కొన్ని బంగారు నగలు తీసుకు వెళ్లారు.ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube