కొవాగ్జిన్ విష‌యంలో మ‌ళ్లీ నిరాశే.. ఆ రోజు ఏం జ‌రుగుతుందో..

క‌రోనా ప్ర‌పంచాన్ని ఎంత‌లా అత‌లా కుత‌లం చేస్తుందో చూస్తూనే ఉన్నాం.ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల‌న్ని దీనిపై యుద్ధం చేస్తూనే ఉన్నాయి.

 Disappointed Again With Covaxin What Will Happen That Day-TeluguStop.com

ఈ మ‌హ‌మ్మారికి ఇప్ప‌టికే ల‌క్ష‌లాదిమంది బ‌లైపోయారు.కోట్లాది మంది దీని బారిన ప‌డ్డారు.

అయితే ఇప్పుడిప్పుడే క‌రోనాకు ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం కూడా విదిత‌మే.ఈ క్ర‌మంలో ఇండియాలో కొవాగ్జిన్‌, కొవీషీల్డ్ కూడా అందుబాటులోకి వ‌చ్చాయి.

 Disappointed Again With Covaxin What Will Happen That Day-కొవాగ్జిన్ విష‌యంలో మ‌ళ్లీ నిరాశే.. ఆ రోజు ఏం జ‌రుగుతుందో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇందులో భారత్ బయోటెక్ సంస్థ డెల‌వ‌ప్ చేసిన‌టువంటి కొవాగ్జిన్ విష‌యంలో మ‌ళ్లీ భార‌త్‌కు నిరాశే ఎదురైంది.

ఎందుకంటే డబ్ల్యూహెచ్ వో వ‌ద్ద దీనికి అత్యవ‌స‌ర వినియోగానికి ప‌ర్మిష‌న్ దొర‌క‌ట్లేదు.

ఇందుకోసం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అదనపు ఇన్ఫ‌ర్మేష‌న్ కావాలంటూ అడ్డు చెబుతోంది.ఇప్ప‌టికే ఈ విష‌జ్ఞ‌మై సాంకేతిక సలహా సంఘం భారత్ బయోటెక్ ను అద‌న‌పు స‌మ‌చారం ఇవ్వాలంటూ కోరింది.

ఇక ఈ స‌మ‌చారం వ‌చ్చిన త‌ర్వాత తుది నిర్ణ‌యం అనేది వ‌చ్చే నెల నవంబరు 3 తారీఖున తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్ప‌టికే భార‌త దేశంలో కొవాగ్జిన్ సంస్థ చాలామందికి వ్యాక్సిన్లు వేస్తున్న విష‌యం విదిత‌మే.

త్వ‌ర‌లోనే మ‌రింత పెద్ద డ్రైవ్ కూడా చేప‌ట్ట‌నుంది.

అయితే ఇంత పెద్ద ఎత్తున త‌మ వ్యాక్సిన్ల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న కూడా త‌మ టీకాకు అత్యవసర వినియోగ జాబితాలో చోటు లేక‌పోవ‌డం బ‌యోటెక్‌కు కొంత ఇబ్బంది క‌లిగించే అంశమే.

ఇందులో భాగంగానే గ‌త ఏప్రిల్ నెల 19వ తారీఖున త‌మ టీకాకు అత్య‌వ‌స‌ర వినియోగానికి ప‌ర్మిష‌న్ ఇవ్వాలంటూ అప్లై చేసుకుంది.ఈ ప‌ర్మిష‌న్ వ‌స్తేనే ఆ టీకాను ప్రపంచవ్యాప్తంగా విదేశాల‌కు కూడా అందించే అవ‌కాశం ఉంటుంది.

దీని కోసం ఎంతో ప్ర‌య‌త్నిస్తున్న భార‌త్ బ‌యోటెక్ కు మాత్రం ప‌ర్మిష‌న్ రావ‌ట్లేదు.మ‌రి న‌వంబ‌ర్ 3న మ‌రోసారి దీనిపై నిర్ణ‌యం తీసుకోనుంది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌.

చూడాలి మ‌రి ఆ రోజు ఏం జ‌రుగుతుందో.

.

#Carona #Covaxin #Covaxin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube