అదృశ్యమైన ఏఎన్-32 ఎయిర్ క్రాఫ్ట్...అన్వేషిస్తున్న అధికారులు

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ అదృశ్యమయ్యింది.ఈశాన్య రాష్ట్రం అసోంలోని జొర్‌హత్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ఆచూకీ తెలియకుండా పోవడం ఐఏఎఫ్ వర్గాల్లో కలకలంరేపుతోంది.అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లా మెచుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు జొర్హట్ నుంచి మధ్యాహ్నం 12.24 గం.లకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్ బయలుదేరింది.టేకాఫ్ అయిన 35 నిమిషాల తర్వాత ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కి గ్రౌండ్ ఏజెన్సీలతో సంబంధాలు తెగిపోయాయి.

 Disappeared An 32 Aircraft 32-TeluguStop.com

మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌‌తో సంబంధాలు తెగిపోయాయని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు.

అదృశ్యమైన ఏఎన్-32 ఎయిర్ క్రాఫ్�

సాధారణంగా సరకు రవాణా కోసం ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ని భారత వైమానిక దళం వినియోగిస్తూ ఉంటుంది.ఆచూకీ గల్లంతైన విమానంలో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు.నిర్ణీత సమయం లోపు గమ్య స్థానానికి చేరకపోవడంతో గల్లంతైన విమానం కోసం గాలిస్తున్నారు.

విమానం జాడ కనుగొనేందుకు అధికారులు సుఖోయ్-30 యుద్ధ విమానం, సీ-130 ప్రత్యేక విమానంను రంగంలోకి దింపారు.ఇప్పటివరకు కూడా ఆ విమానం ఆచూకీ తెలియకపోవడం తో అధికారులు కలవరపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube