ఏపీలో టీడీపీ – జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయినప్పటి నుంచి పలువురు టీడీపీ నేతల్లో అసంతృప్తి రాగం వినిపిస్తోంది.తాజాగా కాకినాడ రూరల్ టీడీపీలో( Kakinada Rural TDP ) అసమ్మతి సెగ రాజుకుంది.
సీట్ల సర్దుబాటు నేపథ్యంలో కాకినాడ రూరల్ స్థానం జనసేనకు( Janasena ) కేటాయించడంతో బీసీ వర్గాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి.
ఈ క్రమంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్తిబాబు( Ex MLA Pilli Sathibabu ) నివాసానికి అనుచరులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు.పిల్లి సత్తిబాబు పోటీ చేయకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.అయితే తొలి జాబితాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒక్క శెట్టి బలిజకు కూడా సీటు కేటాయించకపోవడంతో బీసీ వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.