శ్రీసత్యసాయి జిల్లాలోని పెనుకొండ వైసీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి.పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ శంకరనారాయణకే ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
శంకర నారాయణకు కాకుండా వేరే వాళ్లకు టికెట్ ఇస్తే టీడీపీ గెలుస్తుందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు.కల్యాణదుర్గం ప్రజలు మంత్రి ఉషశ్రీ చరణ్ ను వద్దంటే ఆమెను పెనుకొండకు ఎలా పంపిస్తారని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై వైసీపీ అధిష్టానం మరోసారి పునరాలోచించాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని తెలుస్తోంది.అయితే పార్టీ అధిష్టానం సూచన మేరకు వచ్చే ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేయనున్నట్లు మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.