ఫాస్ట్ ఫుడ్ ఎందుకు తినకూడదు అంటే!  

Disadvantages Of Fast Food-fast Food

English Summary:Bijibijiga ran out of life. Marimukhyanga cities suffer undevalla hard to describe.Go to the office in the morning and hourly traffic. Prayanincalila gantalakoddi again worked throughout the day to cancel.So alasipotuntaru. Came home, ate vandukoni controls to be patient too many times.He fell into the habit of fast food. After the close of the evening or at night, so get to eat fast food or restaurants valipotuntaru the patience to wait for intivanta.But everyone knows ..Fast food is not advisable to pee. That is why it is not advisable...

* Calories in fast food are excessive. Dorakalsina oputa we are absorbed into the body more calories than it is.Open on the risk here.

* The quality of oil used as the fast-food dishes, fresh meat does not even include the many kamplayints.

జీవితం బిజీబిజీగా అయిపోయింది. మరీముఖ్యంగా మహానగరాల్లో ఉండేవాళ్ళ బాధలు వర్ణించడం కష్టం. పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళాంటే గంటలకొద్ది ట్రాఫిక్ లో ఉండాలి...

ఫాస్ట్ ఫుడ్ ఎందుకు తినకూడదు అంటే!-Disadvantages Of Fast Food

రోజంతా పనిచేసి మళ్ళీ గంటలకొద్దీ రద్దిలో ప్రయాణించాలిల. అందుకే అలసిపోతుంటారు. ఇంటికి వచ్చి, వండుకోని తినేంత ఓపిక చాలాసార్లు ఉండట్లేదు.

అందుకే ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడ్డారు. సాయంత్రం అవగానే అలా ఫాస్ట్ ఫుడ్ తినేయటం లేదా రాత్రి ఇంటివంట కోసం ఎదురుచూసే ఓపిక లేక రెస్టారెంట్లలో వాలిపోతుంటారు. కాని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే .

ఫాస్ట్ ఫుడ్ ఒంటికి మంచిది కాదు అని. ఎందుకు మంచిది కాదు అంటే …

* ఫాస్ట్ ఫుడ్ లో కాలరీలు అతిగా ఉంటాయి. మనకు ఓపూట దొరకాల్సిన దాని కన్నా ఎక్కువ కాలరీలు శరీరంలోకి చేరిపోతూ ఉంటాయి.

ఇక్కడే ప్రమాదం మొదలయ్యేది.

* ఫాస్ట్ ఫుడ్ వంటకాల్లో నాణ్యత లేని నూనె వాడుతున్నారని, మాంసాహారం కూడా తాజాగా ఉండదని ఎన్నో కంప్లయింట్స్ ఉన్నాయి. అలాంటి వంటకాలకి దూరంగా ఉండటమే మంచిది కదా!..

* ఫాస్ట్ ఫుడ్ తరుచుగా తినేవారు అధికబరువు సమస్యలతో బాధపడటం దాదాపు ఖాయం.

శరీరంలోకి బాగా కొవ్వుని ఇంజెక్ట్ చేస్తాయి ఫాస్ట్ ఫుడ్ వంటకాలు.

* చాలారకాల ఫాస్ట్ ఫుడ్ పదార్థాల్లో ట్రాస్ ఫ్యాట్ వాడతారట. దీని వలన మన లివర్ పాడయ్యే ప్రమాదం ఎన్నో రేట్లు పెరిగిపోతుంది.

ఇది మద్యం తాగడంతో సమానమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

* గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తీవ్రస్థాయిలో పెరుగుతుంది ఫాస్ట్ ఫుడ్ వలన. కోలెస్టరాల్ లెవెల్స్ ని అమాంతం పేంచేయగలదు ఈ ఫాస్ట్ ఫుడ్ తిండి అలవాటు.