బిస్కట్ల వలన ఇలాంటి నష్టాలు కూడా ఉన్నాయి

పొద్దున్నే టీ తాగితే బిస్కెట్ కావాలి.ఆఫీసులోకి వెళ్ళాక స్నేహితులతో కబుర్లు పెడుతున్నా బిస్కెట్స్ కావాలి.

 Disadvantages Of Biscuits-TeluguStop.com

ఇక సాయంత్రం టీ తాగినా, కాఫీ తాగినా బిస్కేట్స్ కావాల్సిందే.పైకి పెద్దగా కనపించదు కాని, బిస్కెట్స్ తినడం కూడా మనరోజువారి జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది.

బిస్కట్లు త్వరగా ఆకలి తీర్చేసినంత పనిచేస్తాయి.కాని బిస్కెట్ల వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువున్నాయి.

* బిస్కట్లలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.ఎక్కువగా తినే అలవాటు ఉంటే త్వరగా లావెక్కిపోతారు.

అతిగా అలవాటు పడితే మీ ఆర్టెరీస్ బ్లాక్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.

* బిస్కట్స్ ఎక్కువగా రీఫైన్డ్ ఫ్లోర్స్ తో తయారు చేస్తారు.

దీంట్లో ఫైబర్ శాతం తక్కువ ఉంటుంది.

* బిస్కట్లలో చెక్కెర శాతం కూడా ఎక్కువే.

అతిగా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి.

* బిస్కట్స్ తినడాన్ని ఒక అలవాటుగా మార్చేందుకు రకరకాల ఫ్లేవర్స్ వాడుతుంటాయి కంపెనీలు.

పైగా రుచి కోసం షుగర్ ఎక్కువగా వాడతారు.

* ప్యాకింగ్ కవర్ మీద రాసి ఉన్నట్లు కాకుండా, బిస్కెట్ లో హైడ్రోజెనెటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి.

* అతిగా బిస్కట్లు తినడం దంతాల అరోగ్యానికి మంచిది కాదు.అలాగే జీర్ణక్రియలో సమస్యలు కుడా వస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube