వైకల్యంతోనే 2,800 కిలోమీటర్ల సైకిల్ యాత్ర.. ఆదర్శంగా నిలుస్తున్న అధికారి!

పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన పని అయినా సాధించవచ్చు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అనుకున్న పనిలో విజయం సాదిస్తాము.

 Disabled Crpf Officer Who Embarked On A 2800 Km Long Bicycle Trip,bicycle Tourin-TeluguStop.com

ఇలాంటివి చాలా మంది చాలానే చెబుతూ ఉంటారు.కానీ ఇవన్నీ వినడానికి మాత్రమే బాగుంటాయి.

కానీ పాటించడానికి బాగుండవు అనే వారు చాలా మందే ఉంటారు.కానీ ఈ వ్యక్తి గురించి తెలుసుకుంటే మీరు కూడా ఒప్పుకుంటారు.

ఈయన పేరు అజయ్ కుమార్ సింగ్. అతడు బీహార్ రాష్ట్రానికి చెందిన సిస్సార్పీఎఫ్ లో కీలక మైన అధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.ఇతఁడు బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే 2014 సంవత్సరంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఉండగా బాంబు పేలుడు ఘటనలో అతడి కాలికి గాయమయ్యి తీసేసారు.

అయినా అతడు ఏమాత్రం మనోనిబ్బరం కోల్పోకుండా తన బాధ్యతలను ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నాడు.

కృత్రిమ కాలు సహాయంతో విధులను నిర్వహిస్తున్నాడు.తన కాలు కోల్పోయిన కూడా జీవితంలో ఏదోకటి సాధించి అందరిలో తాను ప్రత్యేకంగా ఉండాలి అనుకున్నాడు.

అందుకే సైకిల్ యాత్రలో 2,800 కిలో మీటర్లు ప్రయాణించి అందరి చేత శభాష్ అనిపించు కుంటున్నాడు.

Telugu Adilabad, Adilabadsp, Bicycle, Bicycle Trip, Bihar, Crpf, Cycle Trip, Leg

ఆయన ప్రస్తుతం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కన్యాకుమారి నుండి ఢిల్లీ రాజ్ ఘాట్ వరకు సుమారు 2, 800 కిలో మీటర్లు సైకిల్ యాత్రలో పాల్గొన్నాడు.వీరి సైకిల్ యాత్ర ఆదివారం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది.

Telugu Adilabad, Adilabadsp, Bicycle, Bicycle Trip, Bihar, Crpf, Cycle Trip, Leg

ఈ క్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అజయ్ కుమార్ సింగ్ ను అభినందించారు.ఇంత ధైర్య సాహసాలతో సైకిల్ యాత్రలో పాల్గోంటునందుకు ప్రశంసించారు.మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ధైర్యసాహసాలు నిరూపించుకోవాలని ఆయన కోరుకున్నారు.

విన్నారుగా అజయ్ సింగ్ కథ.ఈయనను స్ఫూర్తిగా తీసుకుంటే ఎంతటి కష్టాలనైనా దైర్యంగా ఎదుర్కోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube