'ఫ్రైడే మూవీస్‌' ను డర్టీ హరి దెబ్బ కొట్టాడా?

తెలుగులో ఓటీటీ లు చాలానే ఉన్నాయి.ప్రత్యేకంగా తెలుగుకు ఆహా ఓటీటీ ఉంది.

 Dirty Hari Movie Now Streaming In Aha Ott, Friday Movie, Att, Ott, Tollywood, On-TeluguStop.com

కేవలం ఓటీటీల మీదే తెలుగు సినిమా కష్టం అనుకున్న జనాలు ఇప్పుడు ఏటీటీని రంగంలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేసింది.మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారే ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీని ఆరంభించారు.

ఏటీటీ అంటే కొత్త సినిమాలను టికెట్టు కొనుక్కుని చూడాల్సి ఉంటుంది.ఏటీటీలో డర్టీ హరి సినిమా విడుదల అయ్యింది.

దాదాపుగా లక్ష మంది వరకు ఫ్రైడే మూవీస్ బ్యానర్‌ లో డర్టీ హరిని చూసినట్లుగా వారు ప్రకటించారు.అసలు ఎంత మంది చూశారు అనే విషయమై క్లారిటీ లేదు.

కాని వారం రోజుల లోపే ఆహాలో డర్టీ హరి ప్రత్యక్షం అయ్యాడు.అయ్యో వారం రోజులు ఆగి ఉంటే 120 రూపాయలు మిగిలేవి కదా అంటూ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్ డర్టీ హరిని చూసి కొందరు అవాక్కవుతున్నారు.

ఇంత త్వరగా ఆహాలో స్ట్రీమింగ్‌ కు ఈ సినిమా సిద్దం అవ్వడం చర్చనీయాంశంగా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు సైతం కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Aha Ott, Dirty Hari, Friday, Telugu Ott-Movie

మరి కొన్ని రోజుల పాటు ఎక్స్ క్లూజివ్‌ గా ఫ్రై డే మూవీస్ లో మాత్రమే స్ట్రీమింగ్ చేసి ఉంటే మరో పాతిక వేల మంది అయినా చూసేవారు కదా అంటూ నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు.అయితే ఆహా వారిదో ఫ్రైడే మూవీస్ ఏటీటీ అక్కడ ఇక్కడ ఎక్కడ చేసినా కూడా నిర్మాతలకు ఇబ్బంది లేదు అన్నట్లుగా ఒప్పందం చేసుకున్నారు.కనుక డర్టీ హరి దెబ్బకు ఏటీటీ నుండి ఓటీటీకి వచ్చేసింది.

అయితే డర్టీ హరి సినిమా మొదటి రోజు విపరీతమైన రద్దీ ఉండటం వల్ల ఫ్రైడే మూవీస్ యాప్‌ క్రాస్‌ అయ్యింది.ఆ కారణంగా మళ్లీ ఫ్రైడే మూవీస్‌ యాప్‌ అంటే కొందరు బూతులు తిడుతున్నారు.

మెయింటెన్స్‌ రాని వారు ఎందుకు యాప్‌ లు పెట్టడం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.బుద్ది తక్కువ టెక్నాలజీ ఎంపిక చేసుకోవడం వల్లే ప్రేక్షకులు ఇబ్బంది పడ్డట్లయ్యింది.

వారు సినిమాను ఎలా విడుదల చేసినా కూడా పర్వాలేదు కాని డబ్బులు తీసుకున్న తర్వాత కూడా సినిమా రాకపోవడంపై చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఫ్రైడే మూవీస్‌ కి డర్టీ హరికి కాస్త దెబ్బ పడ్డట్లే అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube