జబర్దస్త్ లేడీ కమెడియన్ కు తప్పని ఒత్తిడి.. ఆ పని చేయాలంటూ?

Directors Takes Advantage On Jabardasth Varsha, Jabardasth, Varsha, Lady Comedian Varsha, Directors Pressure, Jabardast, Emmanuel

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బుల్లితెరపై అలాగే వెండితెరపై సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారు కెరియర్ మొదట్లో ఎన్నో రకాల కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నవారే.చాలామంది సెలబ్రిటీలు ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మరికొందరి మాత్రం మధ్య తరగతి పేదరికం నుంచి వచ్చి కూడా బుల్లితెరపై వెండితెరపై వారి సత్తాను నిరూపించుకున్నారు.

 Directors Takes Advantage On Jabardasth Varsha, Jabardasth, Varsha, Lady Comedia-TeluguStop.com

మరి ముఖ్యంగా బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ విషయానికి వస్తే ఎంతో మంది కమెడియన్లు ఈ విధంగా సక్సెస్ అయిన విషయం తెలిసిందే.ఎంతోమంది ఆర్టిస్టులకు జబర్దస్త్ జీవితాన్ని ఇచ్చింది.

Telugu Emmanuel, Jabardast, Jabardasth, Lady Varsha, Varsha-Movie

జబర్దస్త్ లో అవకాశం కోసం కూడా చాలామంది ఆర్టిస్టులు కమెడియన్లు అనేక ఇబ్బందులను కష్టాలను ఎదుర్కొన్నారు.అటువంటి వారిలో జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష కూడా ఒకరు.కాగా వర్ష జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.సినిమాల్లో నటిగా నిరూపించుకునే ప్రయత్నాలు చేసే క్రమంలో కొంతమంది దర్శకులు వర్షకి సినిమా పేరుతో చుక్కలు చూపించారని తెలుస్తోంది.

ఇదే విషయాన్ని ఆమె తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడిందట.ఎక్స్పోజింగ్ చేయమని ఆమెని ఒత్తిడి చేశారు అంటూ వర్ష ఆవేదన వ్యక్తం చేసిందట.

Telugu Emmanuel, Jabardast, Jabardasth, Lady Varsha, Varsha-Movie

ఒక సినిమాలో మాత్రమే కాకుండా రెండు మూడు సినిమాలలో ఈ విధంగానే దర్శకులు ఆమెపై ఒత్తిడి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది.అందాలని చూపించాలని ఆమెపై ఒత్తిడి తీసుకురావడంతో వర్ష అవకాశాలను వదులుకుందట.ఆ తర్వాత తన టాలెంట్ తో జబర్దస్త్ లో అవకాశాలను దక్కించుకొని మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న లేడి కమెడియన్స్ లో వర్ష కూడా ఒకరు.

ప్రస్తుతం వర్ష ఇమ్మాన్యుయేల్ తో కలిసి స్కిట్లు చేస్తున్న విషయం తెలిసిందే.వీరిద్దరూ బుల్లితెర జంటగా బాగా పాపులర్ అయ్యారు.

అంతేకాకుండా బుల్లితెరపై సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ తర్వాత ఆ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నారు వర్ష,ఇమ్మాన్యుయేల్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube