టెర్రరిస్ట్ లుక్ లో సమంత... పక్కా డీగ్లామర్ రోల్

స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ సమంత.ఈ అమ్మడు పెళ్లి తర్వాత కూడా రంగస్థలం, మజిలీ, ఓ బేబీ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది.ఇప్పటికి ఆమె స్టార్ ఇమేజ్ ని కొనసాగిస్తుంది.అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత ఆమె బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పాలి.ఈ కారణంగానే ఇప్పుడు ఫిమేల్ సెంట్రిక్ కథలని చేయడానికి సమంత ప్రాధాన్యత ఇస్తుంది.ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న పౌరాణిక ప్రణయ ప్రేమకథ శాకుంతలం సినిమాలో మెయిన్ లీడ్ లో నటిస్తుంది.

 Directors Reveal Samantha Look In The Family Man 2, Tollywood, Bollywood, Amazon-TeluguStop.com

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఇదిలా ఉంటే సమంత డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ ని వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ వెబ్ సిరీస్ టెలికాస్ట్ కాబోతుంది.

ఇక ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న టెర్రరిస్ట్ పాత్రలో కనిపించబోతున్న సంగతి అందరికి తెలిసిందే.

Telugu Amazon Prime, Bollywood, Samantha, Tollywood-Movie

ఇది వరకు విక్రమ్ సినిమాలో బందిపోటు రాణిగా కనిపించిన ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పెద్దగా ఎవరి దృష్టిలో పడలేదు.అయితే ఇప్పటికే ది ఫ్యామిలీ మెన్ మొదటి సీజన్ హిట్ కావడంతో రెండో సీజన్ గా వస్తున్న ది ఫ్యామిలీ మెన్ 2 మీద అంచనాలు ఉన్నాయి.ఈ నేపధ్యంలో ఈ వెబ్ సిరీస్ తర్వాత బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ దొరుకుతుందని సమంత భావిస్తుంది.

ఇదిలా ఉంటే సమంత పుట్టిన రోజు సందర్భంగా దర్శకులు రాజ్, డీకే ది ఫ్యామిలీ మెన్2 లో సమంత క్యారెక్టర్ లుక్ తో తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి విష్ చేశారు.ఈ లుక్ లో పూర్తిగా డీగ్లామర్ గా సమంత కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.

ముస్లిం యువతిగా హ్యూమన్ బాంబ్ గా మారిన అమ్మాయిగా ఆమె పాత్ర ఇందులో ఉండబోతుందని తెలుస్తుంది.రంగస్థలంలో సమంత డీగ్లామర్ పాత్రలో చేసిన తెరపై అందంగానే కనిపిస్తుంది.

కాని ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో మాత్రం ఆమె హీరోయిన్ అనే ఇమేజ్ కి దూరంగా ఉండే పాత్రలో దర్శనం ఇవ్వబోతుందని అర్ధమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube