పవన్‌ కోసం పాత కథలకు దుమ్ము దులుపుతున్న దర్శకులు  

Directors Ready To Make A Film With Pawan Kalyan And Ready For Stories-

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఘోర పరాభవం ఎదురైంది. అద్బుతమైన విజయాలను దక్కించుకుంటుందని భావించిన జనసేన అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ కూడా గెలవక పోవడంతో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు..

పవన్‌ కోసం పాత కథలకు దుమ్ము దులుపుతున్న దర్శకులు-Directors Ready To Make A Film With Pawan Kalyan And Ready For Stories

అత్యంత దారుణంగా పవన్‌ ఓడిపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటీ, ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనీసం అసెంబ్లీకి పవన్‌ ఎన్నిక అయితే ఎమ్మెల్యేగా బిజీగా ఉండే వాడు. కాని ఈ అయిదు సంవత్సరాలు పవన్‌ ఖాళీ ఖాళీగానే ఉండాల్సి ఉంటుంది.

పవన్‌ ఎక్కువ శాతం ఖాళీగా ఉండబోతున్న నేపథ్యంలో ఆయన మళ్లీ సినిమాల్లోకి రావడం వందకు వంద శాతం పక్కా అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలోనే ఆయన కోసం గతంలో తయారు చేసిన కథలను దర్శకులు, రచయితలు దుమ్ము దులిపే పనిలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. త్రివిక్రమ్‌తో గతంలో పవన్‌ కళ్యాణ్‌ ఒక సినిమా చేయాలని భావించాడు.

ఇప్పుడు ఆ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

త్రివిక్రమ్‌ మాత్రమే కాకుండా ఇంకా పలువురు రచయితలు కూడా తాము గతంలో పవన్‌ ను ఊహించుకుని రాసుకున్న కథలతో మళ్లీ ఇండస్ట్రీలోని దర్శకుల వద్దకు వెళ్తున్నారు. పవన్‌ ఇమేజ్‌కు సెట్‌ అయ్యే ఎన్నో కథలు మళ్లీ దుమ్ము దులుపుకుని ఆయన వద్దకు వెళ్లబోతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే దసరా లోపే పవన్‌ కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

రాజకీయ అవసరాల కోసం, ఆర్ధిక అవసరాల కోసం అయినా పవన్‌ తన సినీ కెరీర్‌ను కొనసాగించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్‌ నిర్ణయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.