ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన వారికి ఇదేం పరీక్ష?

టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది అది ఏంటంటే ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న దర్శకులు కనీసం ఏడాది రెండేళ్లు గ్యాప్ తీసుకుంటే గాని తదుపరి సినిమా చేయడానికి హీరోలు దొరకడం లేదు.చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమా చేసిన తర్వాత వివి వినాయక్‌ చాలా గ్యాప్ తర్వాత తదుపరి సినిమానే చేశాడు.

 Directors Koratala Shiva Trivikram Sukumar Taking Very Long Gap For Next Films-TeluguStop.com

ఇక రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ కి ఎంత కాలానికి పుష్ప సినిమా దక్కిందో మనం చూస్తూనే ఉన్నాం.ఇప్పటికి కూడా పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

రంగస్థలం సినిమా వచ్చి మూడేళ్లు కూడా పూర్తి కావస్తుంది.సుకుమార్ తో పాటు ఇదే పరిస్థితిని దర్శకుడు కొరటాల శివ కూడా ఎదుర్కొంటున్నాడు.

రంగస్థలం సినిమా వచ్చిన సమయంలోనే భరత్ అనే నేను సినిమా కూడా వచ్చింది.ఆ సినిమా కూడా సూపర్ హిట్ దక్కించుకుని 100కోట్ల క్లబ్బులో చేరింది.

ఆ సినిమా తెరకెక్కించిన కొరటాల శివ ఇప్పటి వరకు తదుపరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయాడు.

ప్రస్తుతం ఆయన చిరంజీవి ఆచార్య సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

ఆచార్య వచ్చే సంవత్సరం గాని ప్రేక్షకుల ముందుకు రాలేదు.అంటే కొరటాల శివ కూడా తన తర్వాత దాదాపు మూడేళ్లుగా అన్నమాట.

ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అలవైకుంఠ పురంలో సినిమా తో ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న త్రివిక్రమ్ కూడా తన తదుపరి చిత్రాన్ని 2022 వరకు అంటే రెండేళ్ల గ్యాప్ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.అల వైకుంఠ పురం లో సినిమా విడుదలైన వెంటనే ఎన్టీఆర్ తో సినిమాను ప్రకటించిన త్రివిక్రమ్ ఆయన ఆర్ఆర్ఆర్‌ సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఇంకా కూడా ప్రారంభించలేదు.

ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మూవీ వచ్చే ఏడాది లో ప్రారంభమై 2022 లో విడుదలయ్యే అవకాశం ఉంది.అంటే రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇండస్ట్రీ హిట్స్‌ దక్కించుకున్న దర్శకులు ఇంత గ్యాప్ తీసుకోవడం వల్ల ప్రేక్షకులు మంచి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సినిమాలు మిస్‌ అవ్వడంతో పాటు ఈ దర్శకుల సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితికి కారణం ఏంటీ అంటే ఒకొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది.

ముఖ్యంగా ప్లానింగ్‌ లేకపోవడం అంటూ కొందరు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube