మహేష్ ప్రవర్తనకు హర్ట్ అయిన డైరెక్టర్స్.. ఇక ఎప్పటికీ చేయరట!  

Directors Hurt By Mahesh Babu Will Not Do Forever - Telugu Mahesh Babu, Puri Jagannadh, Sukumar, Trivikram, Vamsi Paidipally

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు.

 Directors Hurt By Mahesh Babu Will Not Do Forever

ఇక ఈ సినిమా తరువాత పలువురు డైరెక్టర్స్ మహేష్‌తో సినిమా చేయాలని ఆశించారు.కానీ వారి ఆశలు అడియాసలుగా మిగిలిపోవడంతో, వేరే హీరోలతో సినిమాలు చేస్తున్నారు.

గతంలో మహేష్ బాబుకు పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన పూరీ జగన్నాథ్, మహేష్‌తో ‘జనగణమన’ అనే సినిమాను తెరకెక్కించనున్నట్లు గతంలోనే ప్రకటించాడు.కానీ ఆ సమయంలో పూరీ ఫాంలో లేకపోవడంతో మహేష్ ఆ సినిమాను పక్కనబెట్టాడు.

మహేష్ ప్రవర్తనకు హర్ట్ అయిన డైరెక్టర్స్.. ఇక ఎప్పటికీ చేయరట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక త్రివిక్రమ్ కూడా మహేష్‌తో ‘ఖలేజా’ సినిమా తరువాత మరో సినిమా చేయాలని చాలా కాలం ప్రయత్నించాడు.కానీ మహేష్ ఎంతకీ ఒప్పుకోకపోవడంతో మాటల మాంత్రికుడు ఈ సినిమా ఊసే ఎత్తడం లేదు.

ఇక సుకుమార్‌ది కూడా ఇదే పరిస్థితి.రంగస్థలం చిత్రం తరువాత మహేష్‌కు ఓ కథ వినిపించగా, అందులో మార్పులు చేయాల్సిందిగా పదేపదే చెప్పుకొచ్చాడు మహేష్.

ఇక మహేష్‌కు మహర్షి సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందించిన వంశీ పైడిపల్లితో కూడా మహేష్ ఓ సినిమా చేయాల్సి ఉంది.కానీ మహేష్ తన నెక్ట్స్ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇలా ఇంతమంది డైరెక్టర్స్‌ను మహేష్ హర్ట్ చేయడంతో వారు ఇప్పట్లో ఆయనతో సినిమా చేసే ఆలోచనలో లేరని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.కాగా మహేష్ భార్య నమ్రత ప్రస్తుతం సుకుమార్, పూరీ లాంటి డైరెక్టర్స్‌ను కూల్ చేసే పనిలో పడిందట.

మరి వారు మహేష్‌తో సినిమా చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు