ఒక సినిమా సక్సెస్ కావాలంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా డైరెక్టర్ కారణం అని చెప్పవచ్చు.దర్శకుడు సరైన కథను ఎంచుకుని ఆ కథను తెరపై చక్కగా చూపిస్తే మాత్రమే సినిమా సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది.
అయితే కొంతమంది దర్శకులు సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం, ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి బాహుబలి సినిమాతో పాటు మిస్టర్ మజ్ను సినిమాలో తెరపై కనిపించారు.
మరో డైరెక్టర్ కె రాఘవేంద్రరావు రోషన్ నటిస్తున్న పెళ్లి సందడి సినిమాతో తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.ఈ సినిమాలో రాఘవేంద్రరావు వశిష్ట అనే గెటప్ లో కనిపించనున్నారు.
ఠాగూర్, ఖైదీ నంబర్ 150 సినిమాలలో గెస్ట్ రోల్స్ లో నటించిన వి.వి వినాయక్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో కొన్ని నిమిషాలు డైరెక్టర్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.
ప్రముఖ దర్శకులలో ఒకరైన ఆర్జీవీ కోబ్రా అనే సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నారు.
ఈ సినిమా సక్సెస్ సాధిస్తే వర్మ మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశం ఉంది.దర్శకరత్న దాసరి నారాయణరావు నటుడిగా, దర్శకునిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కూడా పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
లెజండరీ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కె.విశ్వనాథ్ పలు సినిమాల్లో నటించి నటుడిగా కూడా మంచి పేరును సొంతం చేసుకున్నారు.
ఉత్తమ విలన్ సినిమాలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ నటించారు.వరుడు సినిమాలో సింగీతం శ్రీనివాసరావు, శ్రీరంగ నీతులు అడవి దొంగ సినిమాల్లో కోదండ రామిరెడ్డి, పరమ వీర చక్ర సినిమాలో బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, బి.గోపాల్ కొన్ని సెకన్ల పాటు కనిపించారు.గమ్యం, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో క్రిష్ నటించడం గమనార్హం.
పూరీ జగన్నాథ్, పోసాని, పరుచూరి బ్రదర్స్, కాశీ విశ్వనాథ్, తరుణ్ భాస్కర్, ఎస్వీ కృష్ణారెడ్డి, శేఖర్ కమ్ముల, చంద్రసిద్దార్థ్, ఎస్.జె సూర్య సి.సుందర్, సముద్రఖని, వాసు, మరికొందరు దర్శకులు సినిమాల్లో నటించారు.