హమయ్య వినాయక్‌కు హీరో దొరికాడు, కాని ఇదే చివరి ఛాన్స్‌..  

ఒకప్పుడు యాక్షన్‌ చిత్రాలు అంటే వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రాల మాదిరిగా ఉండాలి అంటూ ఒక మార్క్‌ ఉండేది. సీమ సినిమాలు అంటే వినాయక్‌ మాత్రమే చేయాలి. సుమోలు గాల్లో లేవాన్నా, భారీ సంఖ్యలో సుమోల చేజింగ్‌ జరగాలన్నా కూడా అది వినాయక్‌ మాత్రమే చేయగలడు అనే టాక్‌ ఉండేది. అంతటి స్టార్‌డంను దక్కించుకున్న వినాయక్‌ ప్రస్తుతం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చేతిలో సినిమా లేక చాలా నెలలుగా ఖాళీగా ఉంటూ, హీరోలకు కథలు వినిపిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.

Director VV Vinayak Next To Direct Hero Manchu Vishnu-

Director VV Vinayak Next To Direct Hero Manchu Vishnu

ఖైదీ నెం.150 చిత్రానికి దర్శకత్వం వహించిన వినాయక్‌ ఆ చిత్రం సక్సెస్‌ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవడంలో విఫలం అయ్యాడు. దాంతో తదుపరి చిత్రానికి చాలా సమయం పట్టింది. ఎదోలా మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ను బుట్టలో వేసుకుని ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాన్ని చేయడం జరిగింది. ఆ చిత్రం కాస్త డిజాస్టర్‌కా బాప్‌ అయ్యింది. అంతటి ఫ్లాప్‌ తర్వాత వినాయక్‌ దర్శకత్వంలో చేసేందుకు ఏ ఒక్క హీరో కూడా ముందుకు రాలేదు. దాంతో పలు కథలు పట్టుకుని చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలువురి వద్దకు వెళ్లాడు.

వినాయక్‌ దర్శకత్వంలో నటించేందుకు చివరకు మంచు విష్ణు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ‘ఓటర్‌’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న మంచు విష్ణు తన తదుపరి చిత్రాన్ని వినాయక్‌ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. స్క్రిప్ట్‌కు సంబంధించి చిన్న చిన్న మార్పులను మంచు వారి ఫ్యామిలీ చెప్పడం జరిగింది. వినాయక్‌ టీం ఆ మార్పులు చేర్పులు చేస్తుంది. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించేందుకు అన్ని సిద్దం అవుతున్నాయి. ఈ చిత్రంతో అయినా వినాయక్‌ కెరీర్‌ గాడిలో పడుతుందో చూడాలి.

Director VV Vinayak Next To Direct Hero Manchu Vishnu-

ఒకవేళ మంచు విష్ణుతో చేయబోతున్న సినిమా కూడా ఫ్లాప్‌ అయితే వినాయక్‌ ఇక సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిందే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వినాయక్‌ దర్శకత్వంలో ఇప్పటికే సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపడం లేదు. విష్ణు మూవీ కూడా ఫ్లాప్‌ అయితే మరింతగా వినాయక్‌ పరిస్థితి దిగజారే అవకాశం ఉంది.