ఎన్టీఆర్ హెల్ప్ చేసినా ఉపయోగించుకోలేకపోయా.. ప్రముఖ దర్శకుడి కామెంట్స్ వైరల్!

Director Vv Raju Interesting Comments About Senior Ntr

తెలుగు రాష్ట్రాల ప్రజలు అభిమానంగా సీనియర్ ఎన్టీఆర్ ను అన్నగారు అని పిలిచేవారు.రాముడు, కృష్ణుడు లాంటి పౌరాణిక పాత్రలతో పాటు తన నట జీవితంలో సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలలో నటించి మెప్పించారు.

 Director Vv Raju Interesting Comments About Senior Ntr-TeluguStop.com

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు దఫాలుగా ఏడు సంవత్సరాల పాటు సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పని చేశారు.పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే సీనియర్ ఎన్టీఆర్ అధికారాన్ని కైవసం చేసుకున్నారు.

చదువు పూర్తైన తర్వాత ఎన్టీ రామారావుకు మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం రాగా సినిమాలపై ఉన్న ఆసక్తి వల్ల సీనియర్ ఎన్టీఆర్ ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు.సంవత్సరానికి కనీసం పది చొప్పున సినిమాలలో నటించే విధంగా సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను ప్లాన్ చేసుకున్నారు.1972 సంవత్సరం తర్వాత సీనియర్ ఎన్టీఆర్ పారితోషికం లక్షల్లోకి చేరింది.ప్రముఖ దర్శకుడు వి.వి రాజు ఒక ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Director Vv Raju Interesting Comments About Senior Ntr-ఎన్టీఆర్ హెల్ప్ చేసినా ఉపయోగించుకోలేకపోయా.. ప్రముఖ దర్శకుడి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ దగ్గర తాను పని చేసిన తర్వాత చిరంజీవి నటించిన రెండు సినిమాలకు పని చేసే అవకాశం తనకు దక్కిందని వి.వి రాజు అన్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Direction, Director Vv Raju, Interesting Comments, Movie Function, Senior Ntr, Tollywood, Two Movies, Vv Raju, Vv Raju About Sr Ntr, Vv Raju Comments-Movie

ఆ తర్వాత తనకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందని ఆ సినిమాకు పది మంది నిర్మాతలు అని వి.వి.రాజు అన్నారు.సినిమా కార్యక్రమంకు ఆహ్వానించడం కోసం నిర్మాతలతో కలిసి సీఎంగా ఉన్న ఎన్టీఆర్ ను కలవగా తాను మంచి టెక్నీషియన్ అని ఎవరినీ మోసం చేయడం చేతకాదని సీనియర్ ఎన్టీఆర్ నిర్మాతలతో చెప్పారని వి.వి రాజు పేర్కొన్నారు.

Telugu Balakrishna, Chiranjeevi, Direction, Director Vv Raju, Interesting Comments, Movie Function, Senior Ntr, Tollywood, Two Movies, Vv Raju, Vv Raju About Sr Ntr, Vv Raju Comments-Movie

అయితే ఆ కార్యక్రమానికి హాజరు కాలేనని సీనియర్ ఎన్టీఆర్ తనతో చెప్పారని బాలకృష్ణ, మరి కొందరు సినీ ప్రముఖులను కార్యక్రమానికి పంపిస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారని వి.వి.రాజు అన్నారు.ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఎన్టీఆర్ సాయం చేశారని అయితే కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ చేసిన సహాయాన్ని ఉపయోగించుకోలేకపోయానని వి.వి రాజు తెలిపారు.

#Balakrishna #Vv Raju #Vv Raju #Chiranjeevi #Vv Raju Sr

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube