ఆ సినిమాలో ప్రభాస్ నటించాల్సింది.. కానీ ఉదయ్ కిరణ్ తో తీయడంతో...

తెలుగులో 2001వ సంవత్సరంలో తెరకెక్కిన మనసంతా నువ్వే అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి దర్శకుడిగా పరిచయమైన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “వి.ఎన్ ఆదిత్య” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే వి.ఎన్ ఆదిత్య  వచ్చీ రావడం తోనే మనసంతా నువ్వే చిత్రంతో మంచి హిట్ ని అందుకోవడంతో స్టార్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశాలను దక్కించుకున్నాడు.అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని మనసంతా నువ్వే చిత్రం తర్వాత తెరకెక్కించిన “శ్రీరామ్” చిత్రం ఎందుకు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే విషయంపై స్పందించారు.

 Director Vn Aditya React About Sriram Movie Flop, Vn Aditya, Prabhas, Uday Kiran-TeluguStop.com

తమిళంలో మంచి విజయం సాధించిన “దిల్” అనే చిత్రానికి రీమేక్ గా శ్రీరామ్ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపాడు.

అయితే మొదట్లో ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ ను నటింపజేయాలని అనుకున్నప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడ లేదని చెప్పుకొచ్చాడు.ఒకవేళ తాను అనుకున్న విధంగానే ప్రభాస్ కనుక శ్రీరామ్ చిత్రంలో హీరోగా నటించుంటే కచ్చితంగా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద వంద రోజులు ఆడేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

అలాగే తాను మనసంతా నువ్వే చిత్రానికి దర్శకత్వం వహించిన తర్వాత మళ్లీ అలాంటి జోనార్లోనే లవ్ స్టోరీ తరహాలో తన రెండో చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నానని కానీ నిర్మాతల కోసం శ్రీరామ్ చిత్రానికి దర్శకత్వం వహించాలని వచ్చిందని తెలిపాడు.అయితే శ్రీరామ్ చిత్ర ఫలితం తారుమారు అయినప్పటికీ తన కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పుకొచ్చాడు.

Telugu Vnaditya, Prabhas, Sriram Flop, Tollywood, Uday Kiran, Vn Aditya-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఒకప్పుడు నేనున్నాను, మనసంతా నువ్వే, బాస్, మనసు మాట వినదు, తదితర లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలతో బాగానే అలరించిన వి.ఎన్ ఆదిత్య ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు.కాగా ఆ మధ్య “వాళ్ళిద్దరి మధ్య” అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube