ఈ వెంకీ ఎంత మందితో సినిమాలు చేస్తాడండీ?

ఛలో, భీష్మ సినిమాలతో సక్సెస్‌ ఫుల్‌ దర్శకుడిగా పేరు దక్కించుకున్న వెంకీ కుడుముల తదుపరి సినిమా విషయమై గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈయన మహేష్‌ బాబుతో త్రివిక్రమ్‌ తీయబోతున్న సినిమాకు సహాయ దర్శకుడిగా కూడా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

 Director Venky Kudumula Next Movie Hero, Bhishma,  Chalo Movie , Telugu Film New-TeluguStop.com

త్రివిక్రమ్‌ స్కూల్ నుండి వచ్చిన ఈ దర్శకుడు త్వరలోనే యంగ్ హీరోతో సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.గత కొన్ని రోజులుగా ఈయన ముగ్గురు నలుగురు యంగ్‌ హీరోలతో సినిమా లు చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

కాని ఇప్పటి వరకు ఏది కూడా కన్ఫర్మ్‌ అవ్వలేదు.మొన్నటికి మొన్న నాగ చైతన్య హీరోగా ఈయన ఒక సినిమా ను చేసేందుకు సిద్దం అయ్యాడనే వార్తలు వచ్చాయి.

కాని ఇప్పుడు మెగా హీరో వరుణ్‌ తేజ్ తో సినిమా ను చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్‌ బాబు చేయబోతున్న సినిమా కు సహాయ దర్శకుడిగా వ్యవహరిస్తూనే మరో వైపు యంగ్‌ హీరోతో సినిమా ను చేసేందుకు గాను ఈ దర్శకుడు సిద్దం అవుతున్నాడట.

కాని ఇప్పటి వరకు ఏ హీరోతో ఈయన సెట్‌ అవ్వలేదు.మీడియాలో మాత్రం అదుగో ఇదుగో అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇప్పటి వరకు వెంకీ కుడుముల సినిమాకు సంబంధించిన అప్‌ డేట్స్ ఏమీ లేవు.అధికారికంగా ఆయన ఏ సినిమాను ప్రకటించలేదు.

కాని మీడియా సర్కిల్స్‌ లో మాత్రం పుకార్లకు రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.రోజు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ వెంకీ ఎంత మంది హీరోలతో సినిమా చేస్తాడంటూ జోక్స్ చేస్తున్నారు.

మరి కొందరు ఈ పుకార్లకు వెంకీ కుడుముల బ్రేక్ వేసేలా ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది కదా అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube