నాని సినిమాతో నటుడిగా మారిన దర్శకుడు..!

నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో వచ్చిన సినిమా అంటే సుందరానికీ.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.

 Director Venkatesh Maha Turned As Actorr For Nani Ante Sundaraniki , Ante Sunda-TeluguStop.com

నాని సరసన నజ్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో మరో దర్శకుడు నటుడిగా మారినట్టు తెలుస్తుంది.

ఇంతకీ నాని సినిమాలో నటించిన ఆ డైరక్టర్ ఎవరంటే వెంకటేష్ మహా అని అంటున్నారు.

కేరాఫ్ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో అలరించిన వెంకటేష్ మహా నాని అంటే సుందరానికీ సినిమాతో నటుడిగా మారాడు.

సినిమాలో లీలాని పెళ్లాడేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేష్ మహా కనిపించాడు.డైరక్టర్ నటుడిగా అవడం ఇదేమి కొత్తేమి కాదు ఈమధ్యనే యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా నటుడిగా సినిమాలు చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు వెంకటేష్ మహా కూడా అదే రూట్ లో వెళ్తున్నాడు.మరి వెంకటేష్ మహా కూడా అటు డైరక్షన్ ఇటు యాక్షన్ రెండూ బ్యాలెన్స్ చేస్తారేమో చూడాలి.

 నాని అంటే సుందరానికీ సినిమా కొద్దిగా లెంగ్త్ ఎక్కువ అన్న టాక్ వచ్చినా సినిమా మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేస్తున్నారు ఆడియెన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube