అప్పట్లో ఉదయబానుపై అలాంటి రూమర్స్.. కావాలనే చేశారట!

ఒకప్పటి బుల్లితెర యాంకర్ ఉదయభాను గురించి అందరికీ తెలిసిందే.అప్పట్లో యాంకరింగ్ మొదటి స్థానంలో ఉన్న ఉదయభాను.

 Director Veerabhadram Chowdary About Anchor Rumours, Anchor Udhaya Bhanu, Direct-TeluguStop.com

ఎన్నో షోలలో చేసింది.తనకు గల గల మాటలతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక కొన్ని సినిమాలలో కూడా నటించిన ఉదయభాను తన పెళ్లి తర్వాత బుల్లితెరకు కాస్త దూరం అయింది.

ఇక ఈమె బుల్లితెరలో జానపద గేయాలు అందించే కార్యక్రమం లో, డాన్స్ షోలో, చిన్న పిల్లలతో కలిసి ఓ ప్రోగ్రాంలో ఇలా చాలా షో లలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

అప్పట్లో తను కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల వార్తల్లో నిలిచింది.ఇక ఉదయభాను సోషల్ మీడియాలో అంతగా ఆసక్తి చూపకపోయినా కొన్నికొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా కొన్ని విషయాలు పంచుకుంటుంది.

ఇదిలా ఉంటే గతంలో తనకు ఓ దర్శకుడితో సంబంధం ఉందంటూ పుకార్లు చేసిన సంగతి తెలిసిందే.ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.

ఈ వి వి సత్యనారాయణ, తేజ వంటి దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన వీరభద్ర చౌదరి.ఈయన అనుకున్నంత సక్సెస్ లను పొందకపోయినా చిన్నచిన్న ప్రాజెక్టులతో కొంతవరకు విజయాన్ని అందుకుంటున్నాడు.

ఆహనా పెళ్ళంట, పూలరంగాడు వంటి సినిమాల్లో దర్శకత్వం వహించి మంచి గుర్తింపు అందుకున్నాడు.ఇదిలా ఉంటే వీరభద్ర చౌదరి ఓ ఇంటర్వ్యూ లో భాగంగా ఉదయభాను గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.

Telugu Anchorudhaya, Veerabhadram, Rumours, Teja-Movie

ఆయన నాగార్జునతో కలిసి బాయ్ సినిమా కు దర్శకత్వం వహించగా.ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేక పోవడంతో.అదే సమయంలో యాంకర్ ఉదయభాను పై తనకు కొన్ని సంబంధాలు ఉన్నాయంటూ రూమర్స్ వచ్చాయని తెలిపాడు.కానీ అందులో ఎటువంటి నిజం లేదని తేల్చిచెప్పాడు.ఇక ఎవరైనా పండ్లున్న చెట్ల పైనే రాళ్లు వేస్తారని.అలాగే తను కూడా అప్పట్లో వరుస సినిమాల విజయాలతో ఉండేసరికి కావాలని ఎవరో ఇలాంటి పుకార్లు చేశారని తెలిపాడు.ఇక నిజానికి తాను ఉదయభాను ను ఎప్పుడు కలవలేదని.‌.ఆ సమయంలో ఎందుకు ఇలా చేశారని ఇప్పటికీ అర్థం కాలేదని తెలిపాడు.ఇక ఆ సమయంలో తను దర్శకుడిగా బిజీగా ఉండటంవల్ల ఈ విషయాన్ని ఎక్కువ పట్టించుకోలేదని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube