పవన్ వల్లే మూవీ క్లైమాక్స్ మార్చిన దర్శకుడు.. కానీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఖుషీ ఇండస్ట్రీ హిట్ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

 Director Veera Shankar About Gudumbsa Shankar Climax Change-TeluguStop.com

అలా ఫ్లాప్ అయిన సినిమాల్లో గుడుంబా శంకర్ సినిమా ఒకటి.వీరశంకర్ ఈ దర్శకత్వం వహించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వీరశంకర్ గుడుంబా శంకర్ సినిమా గురించి మాటాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Director Veera Shankar About Gudumbsa Shankar Climax Change-పవన్ వల్లే మూవీ క్లైమాక్స్ మార్చిన దర్శకుడు.. కానీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గుడుంబా శంకర్ సినిమాలో మీరాజాస్మిన్ హీరోయిన్ గా నటించగా ఆశిష్ విద్యార్థి విలన్ రోల్ లో నటించారు.

ఈ సినిమాకు మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం.ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కథనం అందించడం గమనార్హం.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలకు భిన్నంగా ఈ సినిమా కథ, కథనం ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

సినిమా క్లైమాక్స్ మరో విధంగా ఉంటే మాత్రం ఈ సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేదని పవన్ ఫ్యాన్స్ భావించారు.అయితే క్లైమాక్స్ భిన్నంగా ఉండటం గురించి వీరశంకర్ మాట్లాడుతూ సినిమాకు మొదట అనుకున్న క్లైమాక్స్ వేరని తర్వాత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు క్లైమాక్స్ మార్చామని వీరశంకర్ చెప్పారు. క్లైమాక్స్ నాచురల్ గా ఉండాలని పవన్ అలా ప్లాన్ చేశారని వీరశంకర్ చెప్పుకొచ్చారు.

అయితే ఫ్యాన్స్ క్లైమాక్స్ ను చూసి సంతృప్తి చెందకపోవడంతో సినిమా ఫ్లాప్ అయిందని వీరశంకర్ తెలిపారు.అయితే సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమా విపరీతంగా నచ్చిందని ఆ సినిమాకు 16 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని వీరశంకర్ తెలిపారు.

సినిమా హిట్టై ఉంటే ఖుషీ స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చి ఉండేవని వీరశంకర్ పేర్కొన్నారు.

#DirectorVeera #Gudumba Shankar #DirectorVeera #Pawan Kalyan #Climax Change

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు