ఏసీపీ ఆఫీస్ లో రామ్ గోపాల్ వర్మ,విషయం ఏంటంటే  

Director Varma Meets Samshabad Acp For Disha Movie - Telugu Director Varma, , Paritala Ravi, Ram Gopal Varma Latest Update, Ram Gopalvarma Make A Disha Movie, Ramgopal Varma Meet Acp, Vanhaveeti Ranga

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శంషాబాద్ ఏసీపీ ఆఫీస్ లో దర్శనమిచ్చారు.గతేడాది లో చోటుచేసుకున్న దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Director Varma Meets Samshabad Acp For Disha Movie - Telugu Director Varma, , Paritala Ravi, Ram Gopal Varma Latest Update, Ram Gopalvarma Make A Disha Movie, Ramgopal Varma Meet Acp, Vanhaveeti Ranga-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ దిశ హత్యాచారం,దోషుల ఎన్ కౌంటర్ ను బేస్ చేసుకొని ఒక సినిమా తీసేందుకు కూడా సిద్దమైనట్లు ప్రకటించారు కూడా.అయితే ఈ సినిమా కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకొనే ప్రయత్నంలోనే వర్మ శంషాబాద్ ఏసీపీ ని కలవాలని అక్కడకి వెళ్లినట్లు తెలుస్తుంది.

ఈ కేసుకు సంబంధించి అసలు పోలీసుల వర్షన్ ఏంటి?అస్లు ఏమి జరిగింది అని తెలుసుకొనేందుకు వర్మ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగానే శంషాబాద్ ఏసిపి ని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కలిసి దిశ ఘటకు సంబంధించిన పలు వివరాలు అడిగి వర్మ తెలుసుకున్నారు.

ప్రధానంగా దిశపై ఎఫ్ఐఆర్ నమోదైన దగ్గర్నుంచి ఎన్ కౌంటర్ జరిగిన పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకున్నారా? అన్న ప్రశ్న తలెత్తినప్పుడు వర్మ తనదైన తీరులో సమాధానం ఇచ్చారు.సినిమాపై ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని,సినిమా తీసేందుకు నాకు స్వేచ్ఛ ఉందంటూ వర్మ తేల్చి చెప్పేశారు.

వర్మ ఇలా సంచలన ఘటనలపై సినిమాలు తీయడం ఇదే తొలిసారి కాదు.

గతంలో కూడా వంగవీటి రంగ,పరిటాల రవి జీవితాల గురించి కూడా అడిగి తెలుసుకొని మరి సినిమాలను నిర్మించి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.ఇప్పడు ఈ దిశ ఘటనపై సినిమా తీసి మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొని పనిలో పడ్డారు.

తాజా వార్తలు

Director Varma Meets Samshabad Acp For Disha Movie-,paritala Ravi,ram Gopal Varma Latest Update,ram Gopalvarma Make A Disha Movie,ramgopal Varma Meet Acp,vanhaveeti Ranga Related....