మహర్షి సినిమా కోసం ఏకంగా ఎనిమిది సాంగ్స్  

మహర్షిలో ఏకంగా ఎనిమిది సాంగ్స్ పెట్టిన దర్శకుడు. .

Director Vamshi Plan To 8 S In Maharshi Movie-dil Raju,director Vamshi,pooja Hegde,superstar Mahesh Babu,tollywood

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా మహర్షి. అల్లరి నరేష్ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే కనిపిస్తుంది. ఇప్పటికే సినిమాలో మహేష్ బాబు లుక్స్ నుంచి సినిమాలో టీజర్ వరకు అన్ని కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి..

మహర్షి సినిమా కోసం ఏకంగా ఎనిమిది సాంగ్స్ -Director Vamshi Plan To 8 Songs In Maharshi Movie

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి వినిపిస్తున్న వార్త మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.మహర్షి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలో రెండు లెరికల్ సాంగ్స్ ని రిలీజ్ చేసారు.

అయితే ఈ సినిమాలో ఈ రెండు బ్యాగ్రౌండ్ సాంగ్స్ అని తెలుస్తుంది. ఇవి కాకుండా సినిమాలో మరో ఆరు సాంగ్స్ ఉన్నాయని, అందులో డ్యూయెట్, సోలో సాంగ్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలో సాంగ్స్ సంఖ్య తగ్గిపోతున్న టైంలో ఇందులో ఏకంగా ఎనిమిది సాంగ్స్ పెట్టడం వెనుక కారణం ఏంటి అనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.