అతన్ని సినిమా నుంచి తప్పించేందుకు జీవిత, రాజశేఖర్ ప్లాన్ చేసి ఇబ్బంది పెట్టారట!

టాలీవుడ్ డైరెక్టర్ సముద్ర గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో అప్పట్లో శివ రామరాజు, సూర్యం, సింహరాశి, మహానంది, ఎవడైతే నాకేంటి లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

 Director V Samudra About Clashes With Raja Sekhar And Jeevitha In Evadaithe Nake-TeluguStop.com

ఇక ఈయన దర్శకత్వం వహించిన సింహరాశి, ఎవడైతే నాకేంటి సినిమాలలో హీరోగా రాజశేఖర్ నటించిన విషయం తెలిసిందే.ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి.

డైరెక్టర్ సముద్ర తన సినీ కెరీర్ ని మొదలు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు గడిచింది.ఈ సందర్భంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సముద్ర తన కెరీర్ లో జరిగిన పలు ఆసక్తికర విషయాల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా సముద్ర మాట్లాడుతూ.హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవిత లతో జర్నీ చేసినప్పుడు వారి మధ్య వచ్చిన ఆటుపోట్ల గురించి వెల్లడించారు.నా జీవితంలో పొరపచ్చాలు అంటే రాజశేఖర్ తో వచ్చింది.రాజశేఖర్ హీరోగా నటించిన ఎవడైతే నాకేంటి సినిమాకు నేను దర్శకత్వం వహించాను.

అంతకుముందు రాజశేఖర్ తో కలిసి సింహరాశి సినిమా చేయగా ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఆ సినిమా తరువాత రాజశేఖర్ కు సరైన హిట్స్ లేకపోవడం తో మధ్యలో కొన్ని కొన్ని సినిమాలకు తనను డైరెక్ట్ చేయమని అడిగారు.

ఆ కథలు నాకు నచ్చకపోవడంతో నేను వద్దని చెప్పాను అని తెలిపారు సముద్ర.ఆ సమయంలో రాజశేఖర్ తనతో నాకు సినిమా చేయడం ఇష్టం లేదని, అందుకే వద్దనుకుంటున్నా అని అనుకునేవారు.

ఆ తరువాత ఎవడైతే నాకేంటి సినిమా కథ విని కథ నచ్చడంతో డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను అని తెలిపారు.

Telugu Jeevitha, Mahanandi, Raja Shekar, Shiva Rama Raju, Simharashi, Suryam, Sa

సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది.సినిమా బాగా వచ్చింది పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం కూడా వచ్చింది.అప్పుడు రాజశేఖర్ ఆయన భార్య జీవిత డైరెక్టర్ గా నా పేరు తీసేసి వాళ్ళ పేర్లు వేసుకోవాలని అనుకున్నారు.

ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ సెట్ లో నన్ను ఇరిటేట్ చేయడం, తక్కువ చేసి మాట్లాడటం లాంటివి చేయడంతో.సరే గొడవ ఇదే కదా ఎందుకొచ్చిన ఇబ్బంది అని అనిపించి.

సినిమాకు డైరెక్టర్ గా నా పేరు బదులుగా మీ పేరు వేసుకోవాలి అనుకుంటున్నారు కదా.వేసుకోండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను వెళ్ళిపోతున్నాను.రేపటి నుంచి రాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని చెప్పుకొచ్చారు సముద్ర.అలా జీవితంలో నాకు అలాంటి ఒక అనుభవం ఎదురు కావడం తొలిసారి అని చెప్పుకొచ్చారు.

ఇక ఆ తర్వాత జీవిత గారు నాతో మాట్లాడారు.రాజశేఖర్ కూడా నువ్వు నాకు బ్రదర్ లాంటి వాడివి అని మాట్లాడారు.

అందుకు నేను కూడా సరే అనుకున్నాను.సినిమా రిలీజ్ అయింది.

సినిమాలో నా పేరు కింద వారి ఇద్దరి పేర్లు వేసుకున్నారు అని చెప్పుకొచ్చాడు సముద్ర.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube