చిన్న సినిమాతో వస్తున్న దర్శకుడు విఎన్ ఆదిత్యా  

Director V.N. Aditya Re-entry With Small Budget Film, Tollywood, Telugu Cinema, South Cinema - Telugu Director V.n. Aditya Re-entry With Small Budget Film, South Cinema, Telugu Cinema, Tollywood

దర్శకుడు వి.ఎన్ ఆదిత్యా అంటే అందరికి వెంటనే గుర్తుకొచ్చే సినిమా మనసంతా నువ్వే.

 Director V N Aditya Re Entry With Small Budget Film

ఉదయ్ కిరణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి.ప్రేమ కథ చిత్రాలలో ఓ కొత్త ఒరవడి తీసుకొచ్చిన ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వి.ఎన్ ఆదిత్యా తరువాత నాగార్జునకి నేనున్నాను సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు.అలాగే ఉదయ్ కిరణ్ కి శ్రీరామ్ అనే ఒక ఎవరేజ్ సినిమా కూడా ఇచ్చాడు.

అయితే ఆ తరువాత ఈ దర్శకుడు చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.మొదటి సినిమా రేంజ్ లో తరువాత సినిమాలు చేయలేకపోయాడు.అతను చివరిగా ముగ్గురు అనే చిన్న సినిమాతో వచ్చాడు.ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

చిన్న సినిమాతో వస్తున్న దర్శకుడు విఎన్ ఆదిత్యా-Movie-Telugu Tollywood Photo Image

మరల తొమ్మిదేళ్ళ గ్యాప్ తర్వాత కొత్తవాళ్లతో ఓ చిన్న సినిమాతో మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.ఈ సినిమాకి లత్కోరు లవ్వింతే అనే డిఫరెంట్ టైటిల్ పెట్టాడు.

ఈ సినిమా ద్వారా ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్నాడు.పాత దర్శకులు మరల తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్ళీ ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుంటున్నారు.

ఇక నాగార్జున లాంటి స్టార్ హీరోతో సినిమా చేసి తరువాత ఫెయిల్యూర్ బాటలో వెళ్లి చిన్న సినిమాతో వస్తున్న వి.ఎన్ ఆదిత్యా తన ఎంట్రీని ఎలా చూపిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు