పూర్తి నిర్మాత అవతారం ఎత్తిన శతమానం దర్శకుడు  

Director Turns Producer Satish Vegesna For Allari Naresh - Telugu Director Turns Producer For Allari Naresh, Naandi Movie, Satish Vegesna, Telugu Cinema, Tollywood

శతమానం భవతి సినిమాతో టాలీవుడ్ లో మంచి టేస్ట్ ఉన్న దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి సతీష్ వేగేశ్న.ఈ దర్శకుడు అంతకు ముందు దొంగల బండి అనే సినిమా తీసిన అది డిజాస్టర్ కావడంతో పెద్దగా ఎవరికీ పరిచయం కాలేదు.

 Director Turns Producer Satish Vegesna For Allari Naresh

అయితే శతమానం భవతి రూపంలో అతనికి బ్రేక్ వచ్చింది.అంత వరకు రచయితగా పలు సినిమాలకి పని చేశారు.

ఈ సినిమా హిట్ తో దిల్ రాజు తన ప్రొడక్షన్ లో శ్రీనివాస కళ్యాణం అనే మరో సినిమా కూడా ఇచ్చాడు.అయితే అది మరీ పాతకాలం వాసనతో ఓవర్ డ్రామాగా అనిపించడంతో జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు.

పూర్తి నిర్మాత అవతారం ఎత్తిన శతమానం దర్శకుడు-Movie-Telugu Tollywood Photo Image

ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా సతీష్ తనకి అలవాటైన ఓవర్ ఎమోషన్స్ ని వదలకుండా కళ్యాణ్ రామ్ తో ఎంత మంచివాడవురా అనే సినిమా తీసాడు.ఈ సినిమాకి తను ఒక నిర్మాతగా వ్యవహరించాడు.

ఇది కూడా డిజాస్టర్ అయ్యింది.దీంతో దర్శకుడుగా కొత్త గ్యాప్ తీసుకొని లో బడ్జెట్ లో సినిమాలు నిర్మించాలని సతీష్ వేగేశ్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మొదటి సినిమా పరిచయంతో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న నాంది సినిమాని వేరొక ఇన్వెస్టర్ తో కలిసి నిర్మిస్తున్నాడు.అల్లరి నరేష్ కెరియర్ లో డిఫరెంట్ జోనర్ సినిమాగా ఇది తెరకెక్కుతుంది.

మరి దీనితో నిర్మాతగా సతీష్ ఎంత వరకు సక్సెస్ అందుకుంటాడు అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Turns Producer For Allari Naresh Related Telugu News,Photos/Pics,Images..