జమున పాత్ర కోసం తమన్నాని ఒప్పించే పనిలో ఉన్న దర్శకుడు

టాలీవుడ్ హాట్ భామ, మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అటు గ్లామర్ తోఇప్పటికే కుర్రకారు హృదయాలని కొల్లగొట్టిన ఈ అమ్మడు సైరా సినిమాతో నటిగా కూడా తన పెర్ఫార్మెన్స్ తో అందరిని మెప్పించింది.

 Director Tries Tamanna For Jamuna Biopic-TeluguStop.com

ఆమె అందంతోనే కాకుండా తన డాన్స్ టాలెంట్ కూడా టాలీవుడ్ లో తనకంటూ ఒక ఫ్యాన్స్ బేస్ ని క్రియేట్ చేసుకుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో డాన్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా సాయి పల్లవి మారిపోయింది కాని ఆమె రాకముందు డాన్స్ అంటే తమన్నా పేరే వినిపించేది.

అంతగా ఆమె తనకంటూ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది.ప్రస్తుతం ఈ అమ్మడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3లో నటిస్తుంది.

 Director Tries Tamanna For Jamuna Biopic-జమున పాత్ర కోసం తమన్నాని ఒప్పించే పనిలో ఉన్న దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమె చేతిలో సినిమాల పరంగా ప్రస్తుతానికి ఇది ఒక్కటే ఉంది.

అయితే ఒకప్పటిలా వచ్చిన ప్రతి పాత్ర చేసుకుంటూ వెళ్ళకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న తమన్నాకి ఇప్పుడు ఒక బయోపిక్ ఆఫర్ వచ్చింది.తెలుగులో సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ నేపధ్యంలో దేవినేని అనే సినిమాని తాజాగా తెరకెక్కించి రిలీజ్ చేసిన శివనాగు అనే దర్శకుడు వెటరన్ స్టార్ హీరోయిన్ జమున బయోపిక్ ని తెరకెక్కించాలని అనుకుంటున్నారు.

ఇక దీనికోసం తమన్నాని కలిసి కథ కూడా చెప్పడం జరిగిందని తెలుస్తుంది.జమున పాత్ర కోసం ఆమె అయితేనే పెర్ఫెక్ట్ అని భావించి దర్శకుడు ఆమెని ఒప్పించే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.

మరి బయోపిక్ సినిమాకి తమన్నా ఎంత వరకు ఒకే చెబుతుంది అనేది వేచి చూడాలి.

#Tamannah #Jamuna Biopic #South Heroines #Sai Pallavi #Tamanna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు