సురేష్ బాబు చిన్న కొడుకు కోసం లైన్ లోకి వచ్చిన డైరెక్టర్ తేజ

బడా నిర్మాతగా ఇండస్ట్రీలో ఓ పెద్ద ఫ్యామిలీ సామ్రాజ్యాన్ని నడుపుతున్న వ్యక్తిగా సురేష్ బాబు ప్రత్యేక గుర్తింపు ఉంది.చిన్న సినిమాలని, కొత్త దర్శకులని ప్రోత్సహిస్తూ ఈ మధ్య కాలంలో సురేష్ బాబు ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు.

 Director Teja Will Direct Daggubati Abhiram First Movie, Tollywood, Suresh Babu,-TeluguStop.com

ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ వచ్చినప్పుడే కొత్త కథలు వస్తాయని, క్రియేటివిటీ పెరుగుతుందని సురేష్ ప్రొడక్షన్ ద్వారా టాలెంటెడ్ యంగ్ స్టార్స్ ని సురేష్ బాబు ప్రోత్సహిస్తూ ఉంటారు.ఇదిలా ఉంటే సురేష్ బాబు పెద్ద కొడుకు రానా ఇప్పటికే టాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ స్టార్ గా ఎదిగిపోయాడు.

అతను ఇండియన్ వైడ్ యాక్టర్ అయిపోయాడు.ఇక ఇప్పుడు సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ ని హీరోగా పరిచయం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

అయితే సరైన కథలు దొరకకపోవడంతో పాటు అతను కూడా మానసికంగా సిద్ధంగా లేకపోవడంతో లేట్ అవుతూ వచ్చింది.

ఇప్పటికే లో యూఎస్ లో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ లో శిక్షణ తీసుకొని వచ్చిన అభిరామ్ ని ఈ ఏడాదిలోనే హీరోగా పరిచయం చేయడానికి సురేష్ బాబు రంగం సిద్ధం చేశాడు.

ఇప్పటికే వేరొక దర్శకుడుగా చర్చించిన ఇప్పుడు డైరెక్టర్ తేజ లైన్ లోకి వచ్చాడు.తేజ ప్రస్తుతం తన సొంతం ప్రొడక్షన్ లో చిత్రం 1.1 అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు.తన మొదటి సినిమా చిత్రంకి పని చేసిన టీం మొత్తం ఈ సినిమాకి వర్క్ చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోగా తేజ తన కొడుకుని పరిచయం చేస్తాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.అయితే ఇప్పుడు ఆ ఫ్రేమ్ లోకి అభిరామ్ వచ్చి చేరాడు.

అభిరామ్ ని హీరోగా నిలబెట్టే బాద్యతని సురేష్ బాబు తేజకి అప్పగించినట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube