తేజకు అంత సీన్‌ ఉందా? తెలుగు ప్రేక్షకులు అంత గొప్ప వారా?  

Director Teja Wants To Do Movie On Article 370-director Teja,director Teja Next Movie,movie On Jammu And Kasmeer,tollywood Box Office,tollywood Gossips

ఈమద్య కాలంలో నిజ జీవితాలపై.నిజ జీవిత సంఘటనలపై సినిమాలు ఎక్కువగా వస్తున్న విషయం తెల్సిందే.నిజ జీవిత సంఘటనల ఆధారంగా వస్తున్న సినిమాలకు మంచి ఆధరణ ఉంటుంది.అందుకే ఇప్పటికే ఎన్నో అలాంటి సినిమాలు వచ్చాయి.

Director Teja Wants To Do Movie On Article 370-director Teja,director Teja Next Movie,movie On Jammu And Kasmeer,tollywood Box Office,tollywood Gossips Telugu Viral News-Director Teja Wants To Do Movie On Article 370-Director Director Next Movie Jammu And Kasmeer Tollywood Box Office Tollywood Gossips

ముఖ్యంగా యూరి వంటి సినిమాలు ఇండియాలో చాలానే వచ్చాయి.బాలీవుడ్‌లో ఈ సినిమాలకు ఆధరణ ఎక్కువగా ఉంటుంది.అయితే ఆర్టికల్‌ 370 రద్దు విషయమై ఒక సినిమాను తీసేందుకు తెలుగు దర్శకుడు సిద్దం అవుతున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు దర్శకుడు తేజ కశ్మీర్‌కు సంబంధించిన సున్నిత విషయమైన ఆర్టికల్‌ 370 కి సంబంధించిన విషయమై సినిమాను తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నాడట.

అయితే తెలుగులో ఇలాంటి సినిమాలను చాలా తక్కువగా ఆధరిస్తారనే టాక్‌ ఉంది.అందుకే తేజ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి సినీ వర్గాల్లో ప్రముఖంగా చర్చ వినిపిస్తుంది.

దర్శకుడు తేజ చాలా రోజులుగా ఈ చిత్రంకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ చేసే పనిలోనే ఉన్నాడట.గత కొంత కాలంగా సక్సెస్‌ లేక చతికిల్ల పడ్డ దర్శకుడు తేజ ఈ సున్నితమైన అంశంను ఎలా డీల్‌ చేస్తాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒక వేళ ఆ సినిమాను ఏదోలా తీసినా కూడా తెలుగు ప్రేక్షకులు అలాంటి సినిమాలను ఆధరించేంత గొప్ప ప్రేక్షకులా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పక్కా ఫక్త్‌ కమర్షియల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ సినిమాలను మాత్రమే మనోళ్లు ఆధరిస్తారు.అందుకే ఈ సినిమాను మనోళ్లు ఆధరిస్తారా లేదా అనేది అనుమానమే అంటున్నారు.