చిత్రం సీక్వెల్ లో మరో వారసుడు.. అతనెవరంటే?

తెలుగు సినీ దర్శకుడు తేజ గురించి అందరికీ తెలిసిందే.మొదట్లో ఈయన నిర్మాతగా, ఛాయాగ్రాహకుడు, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Director Teja Son Chitram Movie Sequel-TeluguStop.com

ఛాయాగ్రాహకుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన తేజ దర్శక నిర్మాతగా మారి మంచి పేరు సంపాదించుకున్నారు.తెలుగు, హిందీ, తమిళ్ లో దర్శకుడిగా, ఛాయాగ్రాహకుడి గా ఎన్నో సినిమాలలో చేసి.తను దర్శకత్వం తో ఉత్తమ అవార్డు లను కూడా సొంతం చేసుకున్నారు.

1989లో శివ సినిమా లో తొలిసారిగా ఛాయాగ్రహణం అందించి మంచి గుర్తింపు పొందారు.ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్ లతో ఛాయాగ్రహణం అందిస్తూ ఆ తర్వాత తొలిసారిగా 2000 సంవత్సరంలో తెరకెక్కిన నువ్వు నేను, జయం సినిమాలతో దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇదిలావుంటే ఫిబ్రవరి 22న పుట్టిన రోజు సందర్భంగా చిత్రం1.1 పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించాడు.అంతేకాకుండా ఈ సినిమాలో 45 మంది కొత్త వాళ్ళను పరిచయం చేయబోతున్నాడట దర్శకుడు తేజ.

 Director Teja Son Chitram Movie Sequel-చిత్రం సీక్వెల్ లో మరో వారసుడు.. అతనెవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో నటీనటులతో పాటు మిగతా నటులు కూడా తన పరిచయం చేయనున్నారు.ఈ సినిమాకు ఆర్ పీ పట్నాయక్ మొత్తం సంగీతాన్ని అందించాడు.ఇన్ని రోజులు అయినా సంగీతానికి దూరంగా ఉండగా మళ్లీ తేజ కోసమే రానున్నాడు.అప్పుడు వచ్చిన చిత్రం సినిమాకు ఉదయ్ కిరణ్ దొరకగా.ఇప్పుడు అలాంటి హీరో మరొకరు కావాలని నిర్ణయించుకున్నారు తేజ.

కానీ ఈసారి తేజ బయట వాళ్ళను కాకుండా ఇంట్లోనే వెతుకుతున్నాడట‌.ఎంతో మంది కొత్తవారిని పరిచయం చేసిన తేజ.ఇప్పుడు తన వారసుడిని కూడా పరిచయం చేయాలనుకున్నాడట.తన కొడుకు అమితోవ్ తేజను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాడట‌.అప్పటికే ఆయనకు నటనలో శిక్షణ ఇప్పించడమే కాకుండా.తను రాసుకున్న కథకు తన కొడుకే సెట్ అవుతాడని తెలిపాడు.ముందు కొన్ని రోజులు తన తో షూట్ చేసిన తర్వాతే సంతృప్తి గా అనిపిస్తే ఓకే చేయనున్నట్లు తెలిపారు లేదంటే మరో హీరో కోసం వెతుకుతానని తెలిపాడు.

#RP Patnaik #Uday Kiran #ChitramMovie #Director Teja #Sequel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు