నా సినిమాల వరుస ప్లాప్ కి కారణం అదే: డైరెక్టర్ తేజ

తెలుగు సినీ దర్శకుడు తేజ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.కెరీర్ మొదట్లో నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయితగా బాధ్యతలను చేపట్టాడు.

 Tollywood Director Teja Respond On Mahesh Babu Nijam Movie Flop, Mahesh Babu , D-TeluguStop.com

ఆ తర్వాత తన దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళం వంటి పలు భాషలలో దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.చాలా వరకు ఈయన తన సినిమాలలో యంగ్ హీరోలను పరిచయం చేశాడు.

అంతే కాకుండా మంచి విజయాలను కూడా అందుకొని పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు.కానీ ఓసారి వరుస ప్లాప్ కి ఓ కారణం ఉందని తెలిపాడు తేజ.

1989లో శివ సినిమాలో తొలిసారిగా ఛాయాగ్రహణం అందించాడు.ఆ తర్వాత పలు సినిమాలలో చేయగా.

అలా చేస్తున్న సమయంలోనే 2000 సంవత్సరంలో తెరకెక్కిన నువ్వు నేను, జయం, చిత్రం వంటి సినిమాలకు దర్శకత్వం వహించి మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇక ప్రస్తుతం తన దర్శకత్వంలో చిత్రం సీక్వెల్ కూడా చేయనున్నాడు.

అందులో ఏకంగా 45 మంది కొత్త వాళ్ళను పరిచయం చేయనున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకున్నాడు.

జయం, నువ్వు నేను సినిమా తర్వాత మహేష్ బాబుతో తన దర్శకత్వంలో నిజం సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Telugu Chitram Sequel, Teja, Flop, Mahesh Babu, Nijam, Okkadu, Tollywood-Movie

కానీ ఈ సినిమా సక్సెస్ కాలేక నిరాశను మిగిల్చింది.ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ.మహేష్ బాబుతో నిజం సినిమా చేయాలనుకున్న సమయంలో అంతలోనే ఒక్కడు సినిమా వచ్చిందని.

ఇక ఈ సినిమాతో మహేష్ కెరీర్ మొత్తం మారిందని తెలిపాడు.

ఇక ఈ సినిమా తర్వాత నిజం సినిమాలో నటించగా ఈ సినిమా మహేష్ బాబు కు నిరాశ కలిగించిందని తెలిపాడు.

Telugu Chitram Sequel, Teja, Flop, Mahesh Babu, Nijam, Okkadu, Tollywood-Movie

కారణం ఒక్కడు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న మహేష్ బాబు.ఈ సినిమాలో ఉన్న కథను తన పాత్రతో మెప్పించలేకపోయాడని.నిజానికి ఇందులో మహేష్ బాబు బాగా నటించాడని.కానీ స్టార్ హోదాలో ఉండే పాటికి ఈ కథ తనకు సెట్ అవలేదని తెలిపాడు.ఒకవేళ ఈ సినిమాలో మరో కొత్త హీరోను పరిచయం చేస్తే పక్క హిట్ అయ్యేదని.అందుకు వరుస ఫ్లాప్ లు అందుకున్నానని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube