తన విలన్ తో యాక్షన్ సినిమాకి సిద్ధం అయిన తేజ  

టాలీవుడ్ లో దర్శకుడుగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి తేజ. చిన్న చిత్రాలతో కెరియర్ ప్రారంభించి వరుసగా హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు తేజ టాలీవుడ్ లో చాలా మంది కొత్త హీరోలని పరిచయం చేసాడు. అయితే ఊహించని విధంగా కెరియర్ లో ఎంత వేగంగా గుర్తింపు తెచ్చుకున్నాడో అంతే వేగంగా వరుస ఫ్లాప్ లతో క్రిందికి పడిపోయాడు..

తన విలన్ తో యాక్షన్ సినిమాకి సిద్ధం అయిన తేజ-Director Teja Plan To Action Film With Gopi Chand

అదే సమయంలో కుటుంబ జీవితంలో కూడా సమస్యల కారణంగా కొంత కాలం విరామం ఇచ్చిన తేజ మరల నేనే రాజు నేనే మంత్రి సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ తో మళ్ళీ తేజ ట్రాక్ లో పడ్డాడని అందరూ భావించారు. ఇకపై సినిమాలు పెద్ద హీరోలతోనే చేస్తానని చెప్పిన తేజ ఆ దిశగా అడుగులు వేసారు.

ఊహించని విధంగా బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ని దర్శకత్వం చేసే అవకాశం దక్కించుకున్న ఊహించని విధంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తరువాత బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కాంబినేషన్ లో సీత అనే సినిమాతో కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యి కనీసం కలెక్షన్స్ సొంతం చేసుకోలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తేజ మరో సినిమాకి రెడీ అవుతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు యాక్షన్ స్టొరీతో తను జయంతో విలన్ గా పరిచయం చేసి తనలోని నటుడుని బయటకి తీసిన గోపీచంద్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో తేజ ఉన్నాడని తెలుస్తుంది.

అయితే ఇప్పటికే వరుస ఫ్లాప్ లతో ఉన గోపీచంద్ మళ్ళీ ఫ్లాప్ దర్శకుడు తేజతో సినిమా అంటే కాస్తా ఆలోచించాల్సిందే అనే మాట ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.