తేజ 'లవ్‌ స్టోరీ' లాగే ఉందే.. కమ్ముల ఏం చేశాడో!

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందిన లవ్‌ స్టోరీ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.వచ్చే వారంలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్‌ సభ్యులు రిలీజ్ చేయడం జరిగింది.

 Director Teja Love Story In Naga Chaitanya Love Story Movie,latest Movie News-TeluguStop.com

సినిమా ట్రైలర్ మరియు టీజర్‌ లు ఇప్పటికే సినిమా పై అంచనాలు ఆకాశానికి పెంచేశాయి.అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా లోని ప్రేమ కథ గతంలో వచ్చిన తేజ సినిమాల ప్రేమ కథల మాదిరిగా అనిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో సాయి పల్లవిని ప్రేమించిన నాగచైతన్య చాలా కష్టపడుతాడు.ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఆయన పడ్డ కష్టం గురించి సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Love Story, Shekhar Kammula, Teja-Movie

గతంలో తేజ ఇలా చాలా సినిమాల్లో చూపించాడు.ఇప్పుడు శేఖర్‌ కమ్ముల కూడా అదే పని చేస్తున్నాడు అంటున్నారు.కథ విషయానికి వస్తే డాన్సింగ్‌ లో ఇంట్రెస్ట్‌ ఉన్న నాగచైతన్య డాన్స్ స్కూల్‌ పెట్టుకుని జీవితాన్ని సాగిస్తున్నాడు.ఆ సమయంలో ఆయనకు సాయి పల్లవి పరిచయం అవుతుంది.

ఆమె ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.అప్పుడే ఆమెకు డాన్స్ పై ఆసక్తి ఉంది.

ఆమె గొప్ప డాన్సర్‌ అని చైతూ తెలుసుకుంటాడు.తద్వార ఆమెను డాన్స్ లోకి ఆహ్వానిస్తాడు.

మొదట నో చెప్పినా ఆ తర్వాత ఓకే చెప్పి అతడితో ప్రేమలో కూడా పడుతుంది.ఇద్దరు కూడా డాన్స్ లో దూసుకు పోతూ ఉంటారు.

ఆ సమయంలో ఇద్దరి ప్రేమ కథ ఇంట్లో తెలియడంతో మొత్తం వ్యవహారం రివర్స్ అవుతుంది.ఆమె ప్రేమను దక్కించుకోవడం కోసం చైతూ ఏం చేశాడు అనేది తేజ తన సినిమాల్లో చూపించినట్లుగా శేఖర్ కమ్ముల చూపించాడా లేదంటే ఏదైనా కొత్తగా ట్రై చేశాడా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube