తేజ ఆ తరహా వెబ్‌ సిరీస్‌ పై క్లారిటీ ఇచ్చాడు

చిన్న చిత్రాలతో పెద్ద సక్సెస్‌లను దక్కించుకుని కెరీర్‌ ఆరంభంలో స్టార్‌ డైరెక్టర్‌గా పేరు దక్కించుకున్న దర్శకుడు తేజ.ఈయన కెరీర్‌లో చిత్రం, జయం, నువ్వు నేను వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు ఉన్నాయి.

 Director Teja, Web Series, Amazon Rights, Amazon Prime, Director Teja Condemns R-TeluguStop.com

అయితే ఆ తరహా సినిమాలను చూసే ప్రేక్షకులు తగ్గడంతో తేజ కెరీర్‌ మెల్ల మెల్లగా డౌన్‌ ఫాల్‌ ప్రారంభం అయ్యింది.దాదాపు పది సంవత్సరాల తర్వాత నేనే రాజు నేనే మంత్రి వంటి కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.

దాంతో తేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడన్నారు.అయితే సీతతో మళ్లీ మూస చిత్రాన్ని తెరకెక్కించి విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఇప్పుడు గోపీచంద్‌తో అలివేలుమంగ వెంకటరమణ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.

కరోనా కారణంగా సినిమాల షూటింగ్‌ జరగడం లేదు.

కేవలం వెబ్‌ సిరీస్‌లు మాత్రమే జరుగుతున్నాయి.అందుకే ఒక వెబ్‌ సిరీస్‌ను తేజ మొదలు పెట్టాడు.

కొత్త వారితో తేజ తీస్తున్న ఆ వెబ్‌ సిరీస్‌ గురించి మీడియాలో రకరకాల ప్రచారాలు ఉన్నాయి.అమెజాన్‌ ప్రైమ్‌ లో ఆ సినిమా ప్రసారం కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత అదో వెబ్‌ సిరీస్‌ కాదు వెబ్‌ మూవీ అని కేవలం గంట వ్యవధి ఉండే ఆ వెబ్‌ మూవీని తేజ విభిన్నమైన రీతిలో తెరకెక్కించాడు అంటూ వార్తలు వచ్చాయి.తాజాగా మరో విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇన్ని చర్చలకు తేజ క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం కరోనా కారణంగా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నా కూడా తేజ తన వెబ్‌ సిరీస్‌ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు.

మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు.తాను వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నాను.

ఇప్పటి వరకు తన వెబ్‌ సిరీస్‌ను ఎవరికి ఇవ్వలేదు.అమెజాన్‌కు స్ట్రిమింగ్‌ రైట్స్‌ ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని పేర్కొన్నాడు.

ఇప్పటి వరకు ఒకే ఒక్క ఎపిసోడ్‌ పూర్తి అయ్యింది అన్నాడు.నందిని రాయ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ లో కాస్త అడల్ట్‌ కంటెంట్‌ ఎక్కువగానే ఉంటుందని ఆయన శిష్యులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube