ఇండస్ట్రీలో కరోనా తర్వాతి పరిస్థితులపై దర్శకుడు తేజ స్పందన

తెలుగు సినిమా పరిశ్రమ లోనే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ కరోనా తర్వాత చాలా సమస్యలను ఎదుర్కొంది… ఇంకా ఎదుర్కొంటూనే ఉంది.ముఖ్యంగా బాలీవుడ్ ( Bollywood )పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 Director Teja Comments About Post Covid Film Industry , Director Teja , Post C-TeluguStop.com

ఈ మూడు సంవత్సరాల్లో హిందీ సినిమా పరిశ్రమ నుండి వచ్చిన సినిమాల్లో సక్సెస్ రేట్ ఐదు లేదా పది శాతం మాత్రమే.ఒకే ఒక్క రూ.1000 కోట్ల సినిమా వచ్చింది.ఇక వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టాల్సిన పదుల కొద్దీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

Telugu Ahimsa, Bollywood, Teja, Covid, Telugu, Tollywood-Movie

దాంతో బాలీవుడ్ సినిమా పరిశ్రమ అత్యంత దయనీయ పరిస్థితిలను ఎదుర్కొంటుంది అంటూ అంతర్జాతీయ స్థాయిలో కూడా కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాయడం జరిగింది.ఆ విషయం పక్కన పెడితే టాలీవుడ్( Tollywood ) కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది.కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమా ను చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించడం లేదు.అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా సినిమాలు కాస్త తగ్గాయి.

అంతే కాకుండా కలెక్షన్స్ సూపర్ హిట్ అయిన సినిమాలకు మాత్రమే వస్తున్నాయి.

Telugu Ahimsa, Bollywood, Teja, Covid, Telugu, Tollywood-Movie

అందుకే చిన్న సినిమాల మాటలు సినిమా మేకింగ్ అంటే భయపడుతున్నారు.ఇలాంటి సమయం లో దర్శకుడు తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆయన దర్శకత్వం లో రూపొందిన అహింస ( Ahimsa )సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారు.కనుక ఎలాంటి ఇబ్బంది లేదు.సినిమాలు బాగుంటే తప్పకుండా మంచి కలెక్షన్స్ వస్తాయి అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.తేజ అభిప్రాయం తో చాలా మంది మీడియా వారు మరియు ఫిల్మ్‌ మేకర్స్‌ ఏకీభవించడం లేదు.

ఇండస్ట్రీ లో కచ్చితంగా ప్రస్తుతానికి కష్ట కాలం కొనసాగుతుంది అనేది ఎక్కువ మంది మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube