ఊరించి ఉసూరుమనిపించాడు.. బెదిరించారా?       2018-05-18   01:13:33  IST  Raghu V

గత మూడు నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో ఉదయ్‌ కిరణ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు తేజ ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆ సినిమా కోసం టైటిల్‌గా ‘కాబోయే అల్లుడు’ అంటూ టైటిల్‌ను కూడా రిజిస్ట్రర్‌ చేయించాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఎన్టీఆర్‌ సినిమా నుండి తప్పుకున్న తేజకు ఏ హీరో కూడా ఛాన్స్‌ ఇవ్వడం లేదు. దాంతో ఆయన అంతా కొత్తవారితో ఉదయ్‌ కిరణ్‌ జీవిత చరిత్రను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే మీడియాలో వచ్చిన వార్తలను దర్శకుడు తేజ కొట్టి పారేశాడు.

-

మీడియాలో వస్తున్నట్లుగా తాను ఉదయ్‌ కిరణ్‌ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించడం లేదని, అంతా కొత్త వారితో ఒక సినిమాను ప్లాన్‌ చేస్తున్న మాట వాస్తవమే కాని ఉదయ్‌ కిరణ్‌ కథ కాదని తేజ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దాంతో పాటు కాబోయే అల్లుడు టైటిల్‌ గురించి కూడా స్పందించాడు. ఆ టైటిల్‌ గురించి తనకు తెలియదు అని, ఆ టైటిల్‌తో తాను సినిమా చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి తేజ మాటలతో ఆయన ఉదయ్‌ కిరణ్‌ జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోవడం లేదని వెళ్లడైంది.

సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో మరో రకమైన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తేజ మీడియాలో వార్తలు వచ్చినట్లుగా ఉదయ్‌ కిరణ్‌ జీవిత చరిత్ర సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నం చేశాడు. అందుకోసం స్క్రిప్ట్‌ కూడా సిద్దం చేయాలని తన శిష్యులను ఆదేశించాడు. కాని మెగా ఫ్యామిలీ ఒత్తిడి కారణంగా సినిమాను స్క్రిప్ట్‌ దశలోనే నిలిపేసినట్లుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి పోటీగా పోయి ఏ పని చేయలేం. అందుకే మెగా ఫ్యామిలీ సభ్యుల సూచన మేరకు ఆ సినిమాను ఆపేసినట్లుగా తెలుస్తోంది.

టైటిల్‌తోనే ఈ సినిమాలో మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేయబోతున్నట్లుగా తేజ చెప్పకనే చెప్పాడు. దాంతో మరింత ఆలస్యం కాకుండా తేజను ఒప్పించే ప్రయత్నం చేసి మెగా ఫ్యామిలీ సఫలం అయ్యింది. తేజ దర్శకత్వంలో ఉదయ్‌ కిరణ్‌ జీవిత చరిత్ర వస్తుందని భావించిన ఆయన అభిమానులు ప్రస్తుతం ఉసూరుమంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతగానో ఆట్టుకున్న ఉదయ్‌ కిరణ్‌ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆయన జీవిత చరిత్ర కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్న వారికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని కొందరు భావించారు. కాని తేజ వారందరి ఆశలపై నీళ్లు జల్లి సినిమాను క్యాన్సిల్‌ చేసుకున్నాడు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.