మన దగ్గర దమ్ము లేనప్పుడు రివ్యూవర్స్‌ను విమర్శించి ఏం లాభం?  

  • ‘పెళ్లి చూపులు’ చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను, విమర్శకుల ప్రశంసలను, అవార్డులను అందుకున్న దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ చాలా గ్యాప్‌ తీసుకుని తన రెండవ సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ సురేష్‌ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిన ఆ చిత్రం తాజాగా విడుదలైంది. సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో దర్శకుడు తరుణ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాంతో రివ్యూవర్స్‌ సినిమాను చీల్చి చెండాడారు. రేటింగ్‌ చాలా తక్కువగా ఇవ్వడంతో ఓవర్సీస్‌ కలెక్షన్స్‌పై ప్రభావం పడటం జరిగింది.

  • -

  • తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రంకు నెగటివ్‌ టాక్‌ రావడంతో ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో భారీగా వసూళ్లు నమోదు అవుతాయని భావించిన చిత్ర యూనిట్‌ సభ్యులకు నిరాశే మిగిలింది. ఆ నిరాశతో దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ అతిగా స్పందిస్తూ ఉన్నాడు. సోషల్‌ మీడియాలో పలువురు పలు రకాలుగా కామెంట్స్‌ చేస్తున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నుండి బయటకు వచ్చేశాడు. తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్‌ చేసుకున్నాడు. ఇక రివ్యూవర్స్‌పై కూడా తీవ్ర స్థాయిలో ఈయన వ్యాఖ్యలు చేశాడు.

  • తాజాగా సన్నిహితుల వద్ద రివ్యూవర్స్‌పై తరుణ్‌ భాస్కర్‌ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. రివ్యూలు రాసేవారికి ఫిల్మ్‌ మేకింగ్‌ తెలుసా, వారు అసలు రివ్యూలు రాసేందుకు ఎలా అర్హులు అంటూ ప్రశ్నించాడట. రివ్యూలు రాసేవారు ఖచ్చితంగా ఫిల్మ్‌ మేకింగ్‌ గురించి తెలిసిన వారు అయ్యి ఉండాలని, అలా కాకుంటే వారు రివ్యూలు రాసేప్పుడు సినిమా బాగున్నా కూడా దాన్ని విశ్లేషించలేక పోతున్నారు అంటూ అభిప్రాయ వ్యక్తం చేశాడట. తన సినిమాకు బ్యాడ్‌ రివ్యూలు ఇచ్చిన వారిపై తరుణ్‌ భాస్కర్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు.

  • రివ్యూలు రాస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణ్‌ భాస్కర్‌ తన మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’ రివ్యూల వల్లే సక్సెస్‌ అయ్యిందనే విషయాన్ని మర్చి పోతున్నాడు. ‘పెళ్లి చూపులు’ చిత్రంకు మొదట పెద్దగా ప్రేక్షకాధర దక్కలేదు. అయితే రివ్యూలు బాగుండటంతో ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. రివ్యూల వల్లే ఓవర్సీస్‌లో కలెక్షన్స్‌ వచ్చాయని నిర్మాత కూడా చెప్పుకొచ్చాడు. అప్పుడు రివ్యూవర్స్‌ వల్ల లాభపడ్డ తరుణ్‌ భాస్కర్‌ ఇప్పుడు మాత్రం సినిమా బాగా తీయలేక పోయి, రివ్యూవర్స్‌పై విరుచుకు పడుతున్నాడు. సినిమా బాగా తీస్తే రివ్యూలు బ్యాడ్‌గా ఎందుకు వస్తాయి చెప్పండి. సినిమా తీయడంలో ఉన్న లోపాలను మాత్రమే రివ్యూవర్స్‌ ఎత్తి చూపుతారు. అందుకే రివ్యూవర్స్‌ను విమర్శించడం మానేసి తన తదుపరి చిత్రానికి అయినా మంచి స్క్రిప్ట్‌ను రెడీ చేయాల్సిందిగా సినీ వర్గాల వారు సలహా ఇస్తున్నారు.