జర్నలిస్ట్ ఎటకారంకి గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి  

Director Takes A Dig At The Journalist, Tollywood, Anuskha Sharma, Virat Kohli, Bollywood, Celebrity Lifestyle, Director Maruthi - Telugu @directormaruthi, Anuskha Sharma, Bollywood, Celebrity Lifestyle, Director Maruthi, Director Takes A Dig At The Journalist, Tollywood, Virat Kohli

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తల్లికాబోతున్న సంగతి తెలిసిందే.ఆమె తన మాతృత్వాన్ని ఆశ్వాదిస్తూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది.

TeluguStop.com - Director Takes A Dig At The Journalist

తండ్రి అవుతున్న అనే ఆనందాన్ని కోహ్లి కూడా పంచుకుంటూ ఆ ఫోటోకి కామెంట్ పెట్టాడు.అయితే దీనిపై ఓ మహిళా జర్నలిస్ట్ అభ్యంతరక వ్యాఖ్యలు చేసింది.

అనుష్క చేసింది ఏదో తప్పు అన్నట్లు ఆమె వెటకారం అనుష్క మాతృత్వాన్ని చులకన చేసే విధంగా కామెంట్ పెట్టింది.సమాజంలో బాధ్యతాయుతమైన జర్నలిస్ట్ హోదాలో ఉంటూ ఒక మహిళ మాతృత్వాన్ని కించపరిచే విధంగా చేసిన ఆమె వాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

TeluguStop.com - జర్నలిస్ట్ ఎటకారంకి గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అందులో భాగంగానే దర్శకుడు మారుతి కూడా ఆమెకి కౌంటర్ ఇచ్చాడు.వివరాలలోకి వెళ్తే అనుష్క పెట్టిన ఫోటోపై జర్నలిస్ట్ మీనా దాస్ నారాయణ్ రియాక్ట్ అవుతూ అనుష్క మీ గుర్రాలకు కాస్త కళ్లెం వేయండి.

మీరు తల్లి మాత్రమే కాబోతున్నారు.ఇంగ్లాండ్ కు మహారాణి కావడం లేదంటూ వ్యాఖ్యలు చేసింది.

అనుష్కపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా మంది నెటిజనులకు ఆగ్రహాన్ని తెప్పించాయి.

ఈ వ్యాఖ్యలపై మన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతి ఘాటుగా స్పందించారు.

చాలా అవమానకరంగా వున్నాయని కౌంటర్ ఇచ్చారు.ఇంగ్లాండ్ రాణి కావడం కంటే మాతృత్వం అనేది పెద్ద ఆనందాన్నిస్తుందన్నారు.

ఒక మహిళా జర్నలిస్టు నుంచి ఈ తరహా అవమానకర వ్యాఖ్యలు రావడం బాధాకరం.ఇంగ్లాండ్ రాణి కావడం కంటే ఓ మహిళకు మాతృమూర్తిగా మారడమే గొప్ప ఆనందాన్ని అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.

ప్రతీ మహిళా ఒక మహారాణే.సంతోషం వెల్లివిరిసిన ప్రతీ ఇల్లూ ఓ రాజ్యమే.

అనుష్క సెలబ్రిటీ కావడానికి ముందు అందరిలాగే ఓ సాధారణ మహిళ.ఆమె తన మాతృత్వం గురించి షేర్ చేసుకోవడానికి ఆమెకు పూర్తి హక్కు స్వేచ్ఛ వుంది` అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు మారుతి.

మారుతి స్పందనకు చాలా మంది సెలబ్రిటీలు సపోర్ట్ గా నిలిచారు.మారుతిపై లావణ్య త్రిపాఠి కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

#Anuskha Sharma #DirectorTakes #Virat Kohli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Takes A Dig At The Journalist Related Telugu News,Photos/Pics,Images..