"జెమ్" థియేటర్ లో విజిల్స్ వేయించే సినిమా - దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం

విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా జెమ్ ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు.సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు.

 Director Susheela Subramanyam About Gem Movie-TeluguStop.com

అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న “జెమ్” చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది.అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో “జెమ్” సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం.

సినిమా మీద కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ కొత్త దర్శకుడు “జెమ్” థియేటర్ లలో విజిల్స్ వేయిస్తుంది అంటున్నారు.చిత్ర విశేషాలను, తన కెరీర్ సంగతులను దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం వివరించారు.ఆయన మాట్లాడుతూ….

 Director Susheela Subramanyam About Gem Movie-జెమ్ థియేటర్ లో విజిల్స్ వేయించే సినిమా – దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

– మాది గుంటూరు జిల్లా తెనాలి.సినిమా మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చాను.రచయిత పోలూరు ఘటికాచలం దగ్గర సహాయ రచయితగా పనిచేశాను.ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను.సుమంత్ ఇదం జగత్ సినిమా కో డైరెక్టర్ గా నా చివరి సినిమా.

ఒక కమర్షియల్ కథ తయారు చేసి నిర్మాతకు చెబితే ఆయన కాంపాక్ట్ బడ్జెట్ లో చేద్దాం అన్నారు.అలా ఈ కథ శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా దగ్గరకు తీసుకెళ్లాం.

– ఇద్దరి అమ్మాయిల మధ్య చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన అహం ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చింది అనేది కథ.ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య అబ్బాయి ఇరుక్కుంటాడు.అనేక సమస్యలు ఎదుర్కొంటాడు.వీళ్ల ఈగో ప్రాబ్లమ్స్ పరిణామాలు ఎదుర్కొంటూ తన ప్రేమను హీరో ఎలా సాధించుకున్నాడు అనేది ఆసక్తికరంగా చూపించాం.

Telugu Director Susheela Subramanyam, Gem Movie, Hero Sivaji Raja Son, Hero Vijay Raja, Mahalakshmi Movie Makers Banner, Nakshatra, Rashi Shingh, Rayalaseema Backdrop Movie, September 17 Theatrical Release, Sivaji Raja Son Movie, Tollywood-Movie

– జెమ్ సినిమాకు పవర్ ఫుల్ నేపథ్యం ఉండాలని రాయలసీమ బ్యాక్ డ్రాప్ పెట్టాం.అంతే కానీ ఈ కథకు రాయలసీమ బ్యాక్ డ్రాప్ కు ఎలాంటి సంబంధం ఉండదు.ఈ కథలో హీరో క్యారెక్టర్ వీడు జెమ్ రా అనిపించేలా ఉంటుంది.అతను చాలా ఇంటెలిజెంట్ గా, ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటాడు.అతనిలో సూపర్ హీరో లక్షణాలు ఉంటాయి.అందుకే టైటిల్ జెమ్ అని పెట్టాం.

రాశీ సింగ్, నక్షత్ర, విజయ్ రాజా ఈ మూడు క్యారెక్టర్స్ సినిమాలో కీలకం.వాళ్లు ఆ క్యారెక్టర్స్ ను సూపర్బ్ గా పర్మార్మ్ చేశారు.

జెమ్ రిలీజ్ అయ్యాక ఈ ముగ్గురికీ మంచి పేరొస్తుంది.

Telugu Director Susheela Subramanyam, Gem Movie, Hero Sivaji Raja Son, Hero Vijay Raja, Mahalakshmi Movie Makers Banner, Nakshatra, Rashi Shingh, Rayalaseema Backdrop Movie, September 17 Theatrical Release, Sivaji Raja Son Movie, Tollywood-Movie

– దర్శకుడిగా నా దృష్టిలో సినిమా అంటే ఎంటర్ టైన్ మెంట్.సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు నవ్వుకోవాలి, థ్రిల్ ఫీలవ్వాలి, పాటలను ఎంజాయ్ చేయాలి.నా సినిమాల్లో అదే ఉండేలా చూసుకుంటాను.ప్రేక్షకులకు ఏదో కొత్త విషయం చెప్పాలి, నేర్పించాలి అనుకోను.

జెమ్ సినిమాకు టెక్నీషియన్స్ ప్రాణం పోశారు.సునీల్ కశ్యప్ సంగీతం, ఆండ్రూ సినిమాటోగ్రఫీ మా సినిమాను మరో లెవెల్ లోకి తీసుకెళ్లాయి.నా నెక్ట్ సినిమా మల్టీస్టారర్ చేద్దామని అనుకుంటున్నాను.యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆ సినిమా ఉంటుంది.

#Sivaji Raja #Gem #Rashi Shingh #Theatrical #Sivaji Raja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు