టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు సూర్యకిరణ్( Suryakiran ) కు ప్రత్యేక గుర్తింపు ఉంది.తక్కువ సినిమాలే చేసినా సూర్యకిరణ్ దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్నారు.
సత్యం, రాజుభాయ్ సినిమాలు సూర్యకిరణ్ కు దర్శకుడిగా మంచి పేరును తెచ్చిపెట్టడంతో పాటు ఆయన రేంజ్ ను పెంచాయి.సూర్యకిరణ్ బాలనటుడిగా 200కు పైగా సినిమాలలో నటించి తన నటనతో మెప్పించడం జరిగింది.
కొన్ని సినిమాలలో సూర్యకిరణ్ సహాయనటుడిగా నటించారు.

సూర్యకిరణ్ మరణ వార్త విని ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ కు గురైంది.గత కొన్నిరోజులుగా జాండీస్ తో బాధ పడుతున్న గుండెపోటుతో మృతి చెందినట్టు తెలుస్తోంది.బిగ్ బాస్ షో సీజన్4 లో సూర్య కిరణ్ కంటెస్టెంట్ గా పాల్గొనడం గమనార్హం.
హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి సూర్య కిరణ్ పెళ్లి చేసుకోగా కొన్ని కారణాల వల్ల ఈ జోడీ విడిపోవడం జరిగింది.

చనిపోవడానికి ముందు సూర్యకిరణ్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.కళ్యాణి( Kalyani ) అమ్మ తర్వాత అమ్మ అని సూర్యకిరణ్ అన్నారు.కళ్యాణిని రోజూ మిస్ అవుతూనే ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.
నా సిస్టర్స్ పై నాకు ఎంత ప్రేమ ఉందో కళ్యాణిపై కూడా అంతే ప్రేమ ఉందని సూర్యకిరణ్ అభిప్రాయపడ్డారు.కళ్యాణి అంటే ప్రేమ, ఇష్టం అని సూర్యకిరణ్ పేర్కొన్నారు.
నేను తనకు అవసరం లేకపోవచ్చు కానీ ఆమె నాకు ఎప్పటికీ అవసరమే అని ఆయన చెప్పుకొచ్చారు.ఫోన్ లో, ల్యాప్ టాప్ లో కళ్యాణి ఫోటో ఉంటుందని సూర్యకిరణ్ వెల్లడించారు.
ఇంకెన్ని జన్మలెత్తినా నా భార్య స్థానం కళ్యాణిదే అని ఆయన పేర్కొన్నారు.సూర్యకిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.