టీవీ9 దేవితో లవ్ ట్రాక్ నడిపేవాడిని.. సూర్య కిర‌ణ్ షాకింగ్ కామెంట్స్‌!  

director surya kiran comments on tv9 devi nagavalli! director surya kiran, tv9 devi nagavalli, latest news, bigg boss 4, nagarjuna, - Telugu Bigg Boss 4, Director Surya Kiran, Latest News, Nagarjuna, Tv9 Devi Nagavalli

ఇటీవ‌ల వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.అంగ రంగ వైభవంగా స్టాట్ అయిన ఈ షోకు మొత్తం 16 మంది కంటెస్టెంట్లు గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వ‌గా.

TeluguStop.com - Director Surya Kiran Comments On Tv9 Devi Nagavalli

మొద‌టి వారం డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ బిగ్ బాస్ ఇంటి నుంచి ఫ‌స్ట్ ఎలిమినేట్ అయ్యారు.ఇక ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన సూర్య కిర‌ణ్.

మిగిలిన కంటెస్టెంట్ల‌ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.

TeluguStop.com - టీవీ9 దేవితో లవ్ ట్రాక్ నడిపేవాడిని.. సూర్య కిర‌ణ్ షాకింగ్ కామెంట్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్ర‌మంలోనే టీవీ9 దేవి నాగవళ్లి గురించి ప‌లు విష‌యాలు చెప్పుకొచ్చారు.

దేవి నాగవళ్లి బిగ్ బాస్ హౌస్‌కు రాక‌ముందు నాకు తెలియ‌దు.కానీ, ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక‌.

బాగా క‌లిసిపోయింది.ఆమె చాలా స్ట్రైట్‌గా, మెచ్యూర్డ్‌గా ఆట‌ ఆడుతోంది.

అదే స‌మ‌యంలో బాగా కష్టపడుతోంది… ఖ‌చ్చితంగా ఆమె ఫైనల్స్‌లో ఉంటుంద‌ని సూర్య కిర‌ణ్ చెప్పుకొచ్చాడు.

అలాగే హౌస్‌లో ల‌వ్ ట్రాక్‌లు గురించి మాట్లాడుతూ.

అఖిల్,మొనాల్,అభిజిత్‌ల మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీ న‌డుస్తోంద‌ని చెప్పిన సూర్య కిర‌ణ్‌.ఎవరికి వారు బాగానే సెట్ చేసుకున్నార‌ని వివ‌రించాడు.

ఇక త‌న‌ను ఓ లవ్ ట్రాక్ నడపమంటే.నేను టీవీ9 దేవి నాగ‌వ‌ల్లితో లవ్ ట్రాక్ నడిపేవాడిని అని సూర్య కిర‌ణ్ ఓపెన్ అయ్యారు.

ఎందుకంటే, ఆమె డైవోర్స్.నేనూ డైవోర్స్.

కాబట్టి ఆమెతో ఒక ల‌వ్‌ ట్రాక్ నడుపుదాం అనుకున్నాను.కానీ, ఊహించ‌ని విధంగా నేను బ‌య‌ట‌కు వ‌చ్చేశా అంటూ ఫ‌న్నీ కామెంట్స్ చేశాడు సూర్య కిర‌ణ్‌.కాగా, రాజ‌మండ్రికి చెందిన దేవి నాగ‌వ‌ల్లికి టీవీ9 జ‌ర్న‌లిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఆమె బిగ్ బాస్ షో ప్రారంభం రోజే.

తాను మ్యూచువల్ డైవోర్స్ తీసుకున్నట్లుగా వెల్ల‌డించింది.అమెరికాకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమె ఏవో కార‌ణాల వ‌ల్ల డైవోర్స్ తీసుకుని.

హైద‌రాబాద్‌కు వ‌చ్చేసింది.ప్ర‌స్తుతం ఆమెకు ఆరేళ్ల బాబు కూడా ఉన్నాడు.

#Nagarjuna #DirectorSurya #Bigg Boss 4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Director Surya Kiran Comments On Tv9 Devi Nagavalli Related Telugu News,Photos/Pics,Images..