ఆ స్టార్ డైరెక్టర్ మూవీను మిస్ చేసుకున్న నితిన్.. ఆ సూపర్ హిట్ పడుంటేనా..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకరు.ఈయన తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు.

 Director Surender Reddy speech At Macherla Niyojakavargam Pre Release Event Det-TeluguStop.com

నితిన్ కెరీర్ స్టార్టింగ్ లో అన్ని హిట్ సినిమాలు తీసి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.వరుస ప్రేమ కథ సినిమాల్లో నటించి హిట్ కొట్టిన ఈయన ఆ తర్వాత తర్వాత మాత్రం వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు.

చాలా ఏళ్ల పాటు నితిన్ నటించిన సినిమాలు అన్ని కూడా వరుస ప్లాప్స్ అయ్యాయి.అయినా కూడా ఈయన ప్రయత్నం మానకుండా వరుస సినిమాలు చేస్తూ ఎన్నో ఏళ్లకు సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.

ఈ జర్నీలో నితిన్ కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.అవి అప్పుడప్పుడు బయట పడుతున్నాయి.

మరి తాజాగా నితిన్ వదులుకున్న సూపర్ హిట్ సినిమా గురించి బయట లీక్ అయ్యింది.తాజాగా ఈయన నటించిన మాచర్ల నియోజక వర్గం రిలీజ్ కు రెడీ అవుతుంది.

డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 12న రిలీజ్ కాబోతుంది.

Telugu Athanokkade, Catherine Tresa, Surender Reddy, Krithi Shetty, Nithiin, Pre

ఈ క్రమంలోనే నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా చేసారు.ఈ ఈవెంట్ లో ఒక విషయం బయట పడింది.ఈ ఈవెంట్ కు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా గెస్ట్ గా వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు.ఈయన నితిన్ దిల్ సినిమాతో హిట్ కొట్టిన తర్వాత అతనొక్కడే కథ వినిపించాడట.

కానీ అప్పట్లో మా కాంబో సెట్ అవ్వలేదు అని.కానీ నితిన్ తో ఫ్యూచర్ లో తప్పకుండ సినిమా చేస్తానని చెప్పాడు.దీంతో నితిన్ అతనొక్కడే హిట్ సినిమాను వదులుకున్నాడని బయట పడింది.ఈ హిట్ సినిమా అప్పుడే పడుంటే ఈయన కెరీర్ మరో రకంగా ఉండేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube