భార్య బర్త్ డే కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సుకుమార్....

తెలుగులో 2004వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ హీరో స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” తో “ఆర్య” చిత్రాన్ని తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన తెలుగు ప్రముఖ దర్శకుడు “సుకుమార్” గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే దర్శకుడు సుకుమార్ సినిమాల్లోకి రాక ముందు లెక్చరర్ గా కొంతకాలం పాటు పని చేశాడు.

 Director Sukumar Special Birthday Wishes To His Wife Tabitha Sukumar-TeluguStop.com

ఆ తర్వాత సినిమాల పై మక్కువ కలగడంతో తన లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి దర్శకుడిగా అవకాశాలను ప్రయత్నించి బాగానే సక్సెస్ అయ్యాడు.దీంతో టాలీవుడ్ లో ఎక్కువ శాతం సక్సెస్ రేటు ఉన్నటువంటి దర్శకులలో సుకుమార్ ఒకరుగా రాణిస్తున్నాడు.

అయితే దర్శకుడు సుకుమార్ ఇంతగా తన సినీ జీవితంలో సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణంగా తన భార్య మరియు అర్ధాంగి సుకుమార్ “తబిత సుకుమార్” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 Director Sukumar Special Birthday Wishes To His Wife Tabitha Sukumar-భార్య బర్త్ డే కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన సుకుమార్….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇటీవలే తబిత సుకుమార్ పుట్టిన రోజు కావడంతో సుకుమార్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన భార్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.

అంతేకాకుండా తన భార్య పై ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ “హ్యాపీ బర్త్ డే మై బాస్ లేడీ !! నీలో ఒక భార్య కంటే, నేను నా జీవితానికి ఒక స్నేహితుడిని కనుగొన్నాను.నువ్వు అద్భుతమైన భార్య మరియు గొప్ప తల్లి అయినందుకు ధన్యవాదాలు.

నువ్వు మా జీవితాలను చాలా సులభతరం చేసావు.కాబట్టి, ఈ ప్రత్యేకమైన రోజు మరియు ప్రతిరోజూ మీకు అర్హమైన అన్ని సంతోషాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను.” అని క్యాప్షన్ కూడా పెట్టాడు.దీంతో కొందరు నెటిజన్లు తబిత సుకుమార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే ఈ పోస్ట్ పై స్పందించిన తబిత సుకుమార్ కూడా “థాంక్యూ మై లవ్” అంటూ రిప్లై ఇచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తబిత సుకుమార్ ఒక పక్క తన కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూనే మరోపక్క యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు పలు సంస్థల్లో పెట్టుబడులు కూడా పెడుతోంది.ఇక దర్శకుడు సుకుమార్ తెలుగులో ప్రస్తుతం “పుష్ప” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ ప్రముఖ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది అలాగే ఈ చిత్రంలో తమిళ ప్రముఖ నటుడు “ఫహద్ ఫైజల్” విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

#Pushpa #Tabitha Sukumar #Sukumar #Wishes #SukumarWishes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు