ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఇంతకంటే పెద్ద గుడ్‌ న్యూస్‌ ఉండదేమో..!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఎప్పటికి మర్చిపోలేని ‘బాహుబలి’ చిత్రాన్ని రాజమౌళి ఇచ్చాడు.దాదాపు అయిదు సంవత్సరాల పాటు కష్టపడ్డ ప్రభాస్‌కు తిరుగులేని క్రేజ్‌ను బాహుబలి తీసుకు వచ్చిన విషయం తెల్సిందే.

 Director Sukumar Next Movie With Prabhas-TeluguStop.com

అద్బుతమైన రికార్డులను ప్రభాస్‌కు బాహుబలి కట్టబెట్టింది.మళ్లీ అంతటి స్థాయిలో సినిమాలు చేయాలని ప్రభాస్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు.సుజీత్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

ఇదే సమయంలో జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ మరో సినిమాను చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు కూడా 2019లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ప్రభాస్‌ 2020వ సంవత్సరంలో ఒక సూపర్‌ సక్సెస్‌ దర్శకుడితో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆయనే సుకుమార్‌.

అవును త్వరలోనే సుకుమార్‌, ప్రభాస్‌ల మూవీ ఉంటుందనే టాక్‌ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.రంగస్థలం చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న సుకుమార్‌ ఆ తర్వాత మహేష్‌ బాబుతో ఒక సినిమాకు సిద్దం అవుతున్నాడు.

అద్బుతమైన కథనంతో సినిమాలు చేస్తాడంటూ టాక్‌ ఉన్న సుకుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ మూవీ అంటే ఖచ్చితంగా అది రికార్డులను బ్రేక్‌ చేసే విధంగా ఉంటుంది.

ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న రెండు చిత్రాల తర్వాత మరే సినిమాకు కూడా కమిట్‌ కాలేదు.బాలీవుడ్‌ నుండి ఆఫర్లు వచ్చినా కూడా ప్రభాస్‌ పట్టించుకోలేదు.కాని సుకుమార్‌ నుండి వచ్చిన ప్రతిపాధనకు మాత్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట.

వీరిద్దరి కాంబో మూవీకి ఇంకా నిర్మాత ఎవరు అనే విషయమై క్లారిటీ రాలేదు.మరో వైపు భారీ ఎత్తున అంచనాలు ఉన్న సాహో చిత్రం కోసం ప్రభాస్‌ చాలా కష్టపడుతున్నాడు.

తాజాగా తన బర్త్‌డే సందర్బంగా చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన ప్రభాస్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube